తెలంగాణ

telangana

By

Published : Sep 12, 2020, 10:50 AM IST

ETV Bharat / sports

యూఎస్​ ఓపెన్​ ఫైనల్​కు​ థీమ్​.. జ్వెరెవ్​తో టైటిల్​ పోరు

యూఎస్​ ఓపెన్​ పురుషులు సింగిల్స్​లో టైటిల్​ పోరులో తలపడే ప్రత్యర్థులు ఎవరనేది తేలిపోయింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో మెద్వెదెవ్(రష్యా)​పై.. థీమ్​(ఆస్ట్రేలియా) విజయం సాధించాడు. ఆదివారం జరగనున్న ఫైనల్లో జ్వెరెవ్​(జర్మనీ)తో తలపడనున్నాడు.

us open
యూఎస్​ ఓపెన్​ ఫైనల్​కు​ థీమ్​.. జ్వెరెవ్​తో టైటిల్​ పోరు

యూఎస్​ ఓపెన్​ పురుషుల సింగిల్స్​ విభాగంలో థీమ్​, జ్వెరెవ్​ ఫైనల్​కు చేరారు. నేడు జరిగిన సెమీఫైనల్​ మ్యాచ్​లో మెద్వెదెవ్(రష్యా)​పై థీమ్​ గెలిచాడు.

ఇప్పటికే బుస్టా(స్పెయిన్​)ఫై జర్మనీ యువ ఆటగాడు జ్వెరెవ్​ విజయం సాధించి ఫైనల్​ చేరాడు. థీమ్​-జ్వెరెవ్​ మధ్య సెప్టెంబర్​ 14న టైటిల్​ పోరు జరగనుంది.

థీమ్​ అదుర్స్​..

శనివారం జరిగిన సెమీస్​ పోరులో మెద్వెదవ్​పై ఆధిపత్యం ప్రదర్శించాడు థీమ్​. చక్కటి ఆటతీరుతో ప్రత్యర్థిని వణికించాడు. 6-2, 7-6,7-6 తేడాతో వరుస సెట్లలోనే గెలిచి ఫైనల్​ చేరాడు థీమ్. తొలిసారి ఈ గ్రాండ్​స్లామ్​ కోసం టైటిల్​ పోరులో పోటీపడుతున్నాడు. ఆస్ట్రేలియా తరఫున ఫైనల్​ చేరిన మొదటి పురుష ఆటగాడిగా ఘనత సాధించాడు.

తొలిసారి...

మరో సైమీఫైనల్​లో పాబ్లో కారెనో బుస్టా(స్పెయిన్​)పై గెలిచిన అలెగ్జాండర్​ జ్వెరెవ్​ ఫైనల్​కు చేరాడు. మూడు గంటల 23 నిమిషాలు ఈ పోరు సాగింది. ఈ మ్యాచ్​లో 3-6, 2,6, 6-3, 6-4, 6-3 తేడాతో విజయం సాధించాడు జ్వెరెవ్​. అంతేకాదు ఇతడు తొలిసారి ఈ గ్రాండ్​స్లామ్​ ఫైనల్​ చేరాడు.

1994లో మైఖేల్​ స్టిచ్​ తర్వాత యూఎస్​ ఓపెన్​ ఫైనల్​ చేరిన జర్మన్​ ప్లేయర్​గా ఘనత సాధించాడు జ్వెరెవ్​.

ABOUT THE AUTHOR

...view details