తెలంగాణ

telangana

ETV Bharat / sports

అంపైర్​పై జకోవిచ్ ఆగ్రహం- ఇటాలియన్ ఓపెన్​లో గెలుపు - అంపైర్​పై జకోవిచ్ ఆగ్రహం

టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్​ ఇటాలియన్​ ఓపెన్​లో విజయం సాధించాడు. అమెరికా ఆటగాడు టేలర్ ఫ్రిట్జ్​ను 6-3,7-6 (5) తేడాతో ఓడించాడు. అయితే.. మ్యాచ్​ జరుగుతుండగా సహనం కోల్పోయి అంపైర్​పై అరిచాడు జకోవిచ్.

Novac  Djokovic
జకోవిచ్, టెన్నిస్ ఆటగాడు

By

Published : May 12, 2021, 2:17 PM IST

ఇటాలియన్​ ఓపెన్​లో అమెరికా ఆటగాడు టేలర్ ఫ్రిట్జ్​పై విజయం సాధించాడు టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్. 6-3,7-6 (5) తేడాతో గెలుపు సొంతం చేసుకున్నాడు. జకోవిచ్​ ఐదుసార్లు ఇటాలియన్ ఓపెన్ టైటిల్​ గెలిచాడు.

సహనం కోల్పోయి...

మ్యాచ్​ జరుగుతుండగా అంపైర్​పై ఆగ్రహం వ్యక్తం చేశాడు జకోవిచ్. రెండో సెట్​ ఆట కొనసాగుతుండగా వర్షం మొదలైంది. ఈ నేపథ్యంలో.. 'ఇంకా ఎంత సేపు ఆటను కొనసాగించలనుకుంటున్నారు' అని అంపైర్​పై అరిచాడు జకోవిచ్. మూడు సార్లు చెప్పినప్పటికీ అంపైర్​ స్పందించలేదని అన్నాడు.

వర్షం కారణంగా మూడు గంటల పాటు మ్యాచ్​ నిలిపివేశారు. అనంతరం.. మ్యాచ్ నెగ్గాలని ఫ్రిట్జ్ ప్రయత్నించినప్పటికీ జకోవిచ్​ చేతిలో ఓటమిపాలయ్యాడు.

ఇదీ చదవండి:'ఏ దిల్‌ మాంగే 'మూవర్‌'' అంటున్న పంత్!

ABOUT THE AUTHOR

...view details