తెలంగాణ

telangana

ETV Bharat / sports

wimbledon: సెమీస్​కు జకోవిచ్​.. ఫెదరర్​, మీర్జా-బోపన్న ఇంటికి - స్పోర్ట్స్​ న్యూస్

టెన్నిస్ స్టార్ ప్లేయర్​ నొవాక్ జకోవిచ్(Novak Djokovic)​ వింబుల్డన్​ సెమీఫైనల్​లోకి ప్రవేశించాడు. మరోవైపు మెన్స్ సింగిల్స్ క్వార్టర్స్ లో ఫెదరర్, మిక్స్​డ్​ డబుల్స్​లో భారత స్టార్ ప్లేయర్స్ సానియా-బోపన్న జోడీ ఓటమి పాలయ్యారు.

wimbledon
వింబుల్డన్, జకోవిచ్

By

Published : Jul 7, 2021, 11:26 PM IST

Updated : Jul 8, 2021, 12:13 AM IST

వింబుల్డన్​లో(Wimbledon)​ సెర్బియా స్టార్‌ నొవాక్‌ జకోవిచ్‌(Novak Djokovic) సెమీఫైనల్​కు చేరుకున్నాడు. బుధవారం జరిగిన క్వార్టర్​ఫైనల్స్​లో 6-3, 6-4, 6-4 తేడాతో హంగేరీకి చెందిన మార్టన్​ (Marton Fucsovics)ను ఓడించాడు. కెరీర్​లో వింబుల్డన్​ సెమీఫైనల్​కు చేరడం ఇతడికి ఇది పదోసారి కాగా గ్రాండ్​స్లామ్​లో 41వ సారి.

ఫెదరర్ ఓటమి

మరోవైపు క్వార్టర్​ ఫైనల్స్​లో ఫెదరర్​ ఓటమి చెందాడు. హర్కజ్​(Hurkacz) 6-3, 7-6 (4), 6-0 తేడాతో అతడిని ఓడించాడు.

సానియా-బోపన్న జోడీ ఇంటికే..

మిక్స్​డ్​ డబుల్స్​ మూడో రౌండ్​లో భారత స్టార్​ ప్లేయర్స్​ సానియా మీర్జా-బోపన్న జోడీ ఓటమి చెందారు. 6-3, 3-6, 11-9 తేడాతో జులైన్ రోజర్, అంద్రేజా క్లెపాక్ ద్వయం చేతిలో పరాభవం చెందారు.
ఇదీ చదవండి:Wimbledon: సెమీస్​లో బార్టీ.. ప్రీక్వార్టర్స్​లో మెద్వెదెవ్​కు షాక్​

Last Updated : Jul 8, 2021, 12:13 AM IST

ABOUT THE AUTHOR

...view details