తెలంగాణ

telangana

ETV Bharat / sports

వింబుల్డన్ ట్రోఫీని ఐదోసారి ముద్దాడిన జకోవిచ్

అత్యంత సుదీర్ఘంగా సాగిన వింబుల్డన్ ఫైనల్​లో జకోవిచ్​నే విజయం వరించింది. స్విస్ దిగ్గజం ఫెదరర్​పై గెలిచిన ఈ క్రీడాకారుడు ఐదో సారి ట్రోఫీని ముద్దాడాడు.

వింబుల్డన్ ట్రోఫీని ఐదోసారి ముద్దాడిన జకోవిచ్

By

Published : Jul 15, 2019, 3:10 AM IST

వింబుల్డన్ ఫైనల్​ మ్యాచ్​ హైలెట్స్

అత్యంత ఉత్కంఠగా సాగిన వింబుల్డన్ పురుషుల సింగిల్స్​ ఫైనల్​లో డిఫెండింగ్ ఛాంపియన్ జకోవిచ్ విజేతగా నిలిచాడు. ఈ టోర్నీ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘంగా 4 గంటల 57 నిమిషాల పాటు ఈ మ్యాచ్​ సాగింది. స్విస్ దిగ్గజ క్రీడాకారుడు ఫెదరర్​పై 7-6 (7/5), 1-6, 7-6 (7/4), 4-6, 13-12 (7/3) పాయింట్ల తేడాతో గెలుపొందాడు జకో.

ఫెదరర్‌ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైనప్పటికీ.. రెండు మ్యాచ్‌ పాయింట్లను కాపాడుకోవడం ద్వారా జకో విజయం సొంతం చేసుకున్నాడు. ఐదోసారి వింబుల్డన్ ట్రోఫీని ముద్దాడాడు.

కప్పును పైకెత్తి సగర్వంగా చూపిస్తున్న ఛాంపియన్ జకోవిచ్

ఈ మ్యాచ్‌లో ఫెదరర్‌ మొదటి నుంచీ గట్టి పోటీ ఇస్తూ వచ్చాడు. తొలి సెట్‌ను 6-7 వరకూ తీసుకెళ్లి ఓడిపోయాడు. రెండో సెట్‌ను 6-1 తేడాతో అలవోకగా గెల్చుకొని జకోవిచ్‌కు సవాలు విసిరాడు. మూడో సెట్‌లోనూ ప్రత్యర్థికి చెమటలు పట్టించిన ఫెదరర్ ఆ సెట్​ను స్వల్ప తేడాతో కోల్పోయాడు.

రోజర్ ఫెదరర్- జకోవిచ్

నాలుగో సెట్‌లో తిరిగి పుంజుకున్న ఫెడెక్స్ 6-4 తేడాతో కైవసం చేసుకున్నాడు. నిర్ణయాత్మక ఐదో సెట్‌లో ఇద్దరి మధ్య ఆద్యంతం హోరాహోరీ పోరు కొనసాగి చివరికి టై బ్రేక్‌కు వెళ్లింది. ఒక గేమ్‌ జకోవిచ్‌ గెలిస్తే... మరో గేమ్ ఫెదరర్‌ గెలుస్తూ వచ్చాడు. చివరకు రెండు గేమ్‌ పాయింట్లు ఆధారంగా జకో విజయాన్ని అందుకున్నాడు.

వింబుల్డన్ ట్రోఫీపై జకోవిచ్ పేరు చెక్కుతూ

71 ఏళ్లలో గేమ్ పాయింట్ల ఆధారంగా విజయం సాధించిన తొలి టెన్నిస్‌ క్రీడాకారుడిగా జకోవిచ్‌ నిలిచాడు.

ఇది చదవండి:వింబుల్డన్​: సెరెనాపై హలెప్ సంచలన విజయం

ABOUT THE AUTHOR

...view details