తెలంగాణ

telangana

ETV Bharat / sports

సంప్రాస్​ను దాటిన జకో.. ఫెదరర్​ రికార్డుపై గురి - జకోవిచ్ తాజా వార్తలు

ఏటీపీ ర్యాంకింగ్స్​లో అత్యధిక వారాలు నంబర్​వన్​గా ఉన్న ఆటగాళ్ల జాబితాలో జకోవిచ్ రెండో స్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం సంప్రాస్​ను దాటిన జకో.. త్వరలోనే ఫెదరర్​ను అందుకోవడానికి ప్రయత్నిస్తానని తెలిపాడు.

Djokovic Passes Sampras With 287th Week At No. 1 In ATP Rankings
సంప్రాస్​ను దాటిన జకో.. ఫెదరర్​ రికార్డుపై గురి

By

Published : Sep 27, 2020, 8:13 AM IST

ప్రపంచ నంబర్‌వన్‌ జకోవిచ్‌ అత్యధిక వారాల పాటు ఏటీపీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగిన ఆటగాళ్ల జాబితాలో మరింత ముందంజ వేశాడు. నంబర్‌వన్‌ ఆటగాడిగా 287వ వారానికి చేరుకున్న జకో.. సంప్రాస్‌ (286 వారాలు)ను అధిగమించి ఆ జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు. దిగ్గజ ఆటగాడు ఫెదరర్‌ (310 వారాలు) తొలి స్థానంలో ఉన్నాడు. ఫెదరర్‌ను అందుకునేందుకు శ్రమిస్తానని జకోవిచ్‌ తెలిపాడు.

"ఫెదరర్‌ను అందుకోవడానికి ఎన్ని వారాల దూరంలో ఉన్నానో నాకు తెలుసు. ఆట పరంగా ప్రస్తుతం ఉత్తమ దశలో ఉన్నా. అత్యధిక వారాల పాటు నంబర్‌వన్‌ స్థానంలో ఉన్న ఆటగాడిగా రికార్డు సృష్టించాలన్నదే నా లక్ష్యం" అని జకో పేర్కొన్నాడు. ర్యాంకింగ్స్‌లో ఎవరూ అడ్డురాకుంటే వచ్చే ఏడాది మార్చి 8కి అతను.. ఫెదరర్‌ను దాటేస్తాడు.

ABOUT THE AUTHOR

...view details