తెలంగాణ

telangana

By

Published : Apr 16, 2021, 1:43 PM IST

ETV Bharat / sports

మోంటే కార్లో మాస్టర్స్​: జకో ఓటమి, క్వార్టర్స్​కు రఫా​

స్టార్ టెన్నిస్ ఆటగాడు జకోవిచ్​.. మోంటో కార్లో మాస్టర్స్​లో ఓటమి పాలయ్యాడు. బ్రిటన్​ ప్లేయర్​ డాన్ ఇవాన్స్​ చేతిలో 6-4, 7-5తో పరాజయం చెందాడు. మరో స్టార్ ఆటగాడు నాదల్​ మాత్రం క్వార్టర్స్​కు అర్హత సాధించాడు.

Nadal, Djokovic, Monte Carlo Masters
నొవాక్ జకోవిచ్, మోంటో కార్లో మాస్టర్స్​

ఫ్రాన్స్​ వేదికగా జరుగుతున్న మోంటే కార్లో మాస్టర్స్​ టోర్నీలో ప్రపంచ నంబర్​ వన్ టెన్నిస్ స్టార్​ నొవాక్ జకోవిచ్​ పరాజయం పాలయ్యాడు. బ్రిటన్ ప్లేయర్​ డాన్ ఇవాన్స్​ చేతిలో 6-4, 7-5 తేడాతో ఓడిపోయాడు. అయితే తన కెరీర్​లోనే ఇదో అత్యంత చెత్త ప్రదర్శన అని జకోవిచ్​ పేర్కొన్నాడు. ఈ మ్యాచ్​ విజయంతో ఇవాన్స్​ క్వార్టర్​ ఫైనల్లోకి ప్రవేశించాడు.

"నిజం చెప్పాలంటే ఇదొక చెత్త ప్రదర్శన. కోర్టులో ఇవాన్స్​ను నిలువరించలేకపోయా. ఈ మ్యాచ్​ మొత్తం భయంకరంగా భావించాను. ఏమీ చేయలేకపోయా. జన్నిక్​తో మ్యాచ్​కు ఇది పూర్తిగా వ్యతిరేకం. ఇవాన్స్​ నా ఆటను కుప్పకూల్చాడు" అని నొవాక్ అభిప్రాయపడ్డాడు.

ఇదీ చదవండి:'ప్లాన్-బీ'తో ఒలింపిక్స్​కు సాత్విక్-చిరాగ్​ జోడీ

మరో స్టార్ ఆటగాడు, 11 సార్లు మోంటే కార్లో ఓపెన్ విజేత రఫెల్​ నాదల్​ క్వార్టర్స్​కు అర్హత సాధించాడు. బల్గేరియా ప్లేయర్ డిమిత్రోవ్​తో జరిగిన మ్యాచ్​లో 6-1, 6-1 తేడాతో సునాయాస విజయం సాధించాడు. నాదల్​ తన తదుపరి మ్యాచ్​లో ఆండ్రీ రుబ్లేవ్​తో తలపడనున్నాడు.

గ్రీక్​ టెన్నిస్ ఆటగాడు స్టెఫానోస్​ సిట్సిపాస్​.. క్రిస్టియన్​ గారిన్​ను 6-3, 6-4 తేడాతో ఓడించి క్వార్టర్స్​కు అర్హత సాధించాడు.

ఇదీ చదవండి:'ధోనీ.. ఏడో స్థానంలో వచ్చి ఏం సాధించలేవ్​'

ABOUT THE AUTHOR

...view details