Djokovic Australian Open 2022: ప్రపంచ నంబర్‌వన్ టెన్నిస్ క్రీడాకారుడు నొవాక్ జకోవిచ్ వీసా రద్దు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. కరోనా వ్యాక్సినేషన్‌కు సంబంధించి తగిన ఆధారాలు సమర్పించని కారణంగా జకోవిచ్‌ను నిలిపిపేసినట్లు ఆస్ట్రేలియా బోర్డర్ ఫోర్స్ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో కోర్టును ఆశ్రయించిన సెర్బియా ఆటగాడికి ఉపశమనం లభించింది. జకోవిచ్‌ను వెంటనే తిరిగివెళ్లమనకూడదని.. సోమవారం వరకు అతడు మెల్బోర్న్లో ఉండొచ్చని సంబంధిత కోర్టు తీర్పు ఇచ్చింది.
తొలుత.. ఆస్ట్రేలియా ఓపెన్‌లో పాల్గొనేందుకు మెల్బోర్న్ చేరుకున్నాడు జకోవిచ్. అయితే.. వ్యాక్సినేషన్‌కు సంబంధించిన విషయంలో స్పష్టత లేని కారణంగా అతడి వీసాను రద్దు చేశారు అధికారులు. ఫలితంగా 8 గంటలపాటు అతడు మెల్బోర్న్ విమానాశ్రయంలోనే ఉండిపోయాడు.
కాగా, డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉన్న జకోవిచ్ ఇప్పటికే 9 సార్లు 'ఆస్ట్రేలియన్ ఓపెన్' టైటిళ్లు కైవసం చేసుకున్నాడు.