కజకిస్థాన్ నూర్ సుల్తాన్ వేదికగా జరిగిన డేవిస్ కప్ పోరులో పాకిస్థాన్‌పై గెలిచి స్వదేశానికి చేరుకున్నారు భారత ఆటగాళ్ల. వీరికి దిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఘనస్వాగతం లభించింది. నాన్ ప్లేయింగ్ కెప్టెన్ రోహిత్ రాజ్‌పాల్‌తో పాటు లియాండర్ పేస్‌కు స్వాగతం పలికేందుకు అభిమానులు పెద్ద ఎత్తున వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పేస్.. నాన్ ప్లేయింగ్ కెప్టెన్ రోహిత్ రాజ్‌పాల్ జట్టును ముందుండి నడింపించాడని ప్రశంసించాడు.
"తటస్థ వేదికపై పాకిస్థాన్‌తో జరిగిన డేవిస్ కప్‌లో భారత్ విజయం సాధించడం సంతోషంగా ఉంది. రోహిత్ రాజ్‌పాల్ జట్టును ముందుండి నడిపించాడు. ఆటగాళ్లలో సమన్వయాన్ని పెంపొందించాడు. జట్టుగా అందరూ చాలా బాగా ఆడారు."
-లియాండర్ పేస్, టెన్నిస్ ప్లేయర్