మహిళల సింగిల్స్ డిఫెండింగ్ ఛాంపియన్ సిమోనా హలెప్ వింబుల్డన్ ఓపెన్ 2021 నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. కాలి గాయంతో బాధపడుతున్న హలెప్ ఈ నిర్ణయం తీసుకుంది.
రోమ్ వేదికగా మేలో జరిగిన డబ్ల్యూటీఏ ఈవెంట్లో గాయం కారణంగా ఆట మధ్యలోనే తప్పుకొంది హలెప్. అప్పటి నుంచి ఆటకు దూరంగా ఉన్న ఆమె.. ఇటీవల ముగిసిన ఫ్రెంచ్ ఓపెన్‌లోనూ పాల్గొనలేదు.
"కాలిపిక్క గాయం కారణంగా వింబుల్డన్‌లో పాల్గొనట్లేదు. దురదృష్టవశాత్తూ నా శరీరం సహకరించట్లేదు. గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. ఈ నిర్ణయం తీసుకోవడానికి చాలా కలత చెందా. ఇటీవల ఫ్రెంచ్ ఓపెన్‌తో పాటు ప్రస్తుత టోర్నీకి కూడా దూరం అవ్వడం బాధాకరం. దీని నుంచి తేరుకోవడానికి నేను మానసికంగా, భౌతికంగా దృఢంగా తయారవ్వాల్సిన అవసరం ఉంది."