పాకిస్థాన్ - భారత్ మధ్య మ్యాచ్ అంటే.. ఎంతో క్రేజ్. ఒక్క క్రికెట్లోనే కాదు.. ఏ ఆటైనా అంతే కసితో విజృంభిస్తారు మన ఆటగాళ్లు. తాజాగా డేవిస్ కప్‌లోనూ భారత టెన్నిస్ ప్లేయర్లు దూకుడు చూపించారు. తటస్థ వేదికైన కజకిస్థాన్‌లో జరుగుతున్న పోరులో 2-0 తేడాతో ఆధిక్యం సాధించింది భారత్. యువ క్రీడాకారులు రామ్‌కుమార్ రామనాథన్, సుమిత్ నాగల్ సత్తాచాటారు.
రామనాథన్, నాగల్ విజయ భేరి..
మొదట జరిగిన సింగిల్స్ మ్యాచ్‌లో రామనాథన్ 6-0, 6-0తో మహ్మద్ షోయబ్ (17 ఏళ్లు)ను చిత్తుగా ఓడించాడు. కేవలం 42 నిమిషాల్లోనే మ్యాచ్ ముగించాడు. ఆద్యంతం ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించాడు. కేవలం రెండో సెట్ ఆరో గేమ్‌లో మాత్రమే రామనాథన్‌కు షోయబ్ కాస్త పోటీనిచ్చాడు.
అంతకు ముందు జరిగిన మ్యాచ్‌లో సుమిత్ నగాల్ డేవిక్‌కప్‌లో తొలి విజయం నమోదు చేశాడు. రెండో సింగిల్స్‌లో హఫైజా మహ్మద్ రెహ్మాన్‌ను 6-0, 6-2 తేడాతో వరుస సెట్లలో ఓడించాడు. ఈ పోరు కాస్త ఆసక్తికరంగా సాగింది.
ఇందులో గెలిస్తే పేస్ రికార్డు..