తెలంగాణ

telangana

ETV Bharat / sports

డెవిస్​ కప్​: నేడే భారత్​-పాకిస్థాన్​ మధ్య పోరు

కజకిస్థాన్​ వేదికగా శుక్రవారం(నవంబర్​ 29) జరగనున్న డెవిస్​ కప్​ పోరులో తలపడనున్నాయి భారత్​-పాకిస్థాన్​ జట్లు. తొలుత పాక్​లోని ఇస్లామాబాద్​లో ఈ మ్యాచ్​లు నిర్వహించాలని అనుకున్నారు. అయితే భారత్​ కోరిక మేరకు తటస్థ వేదికపై మ్యాచ్​ జరగనుంది.

davis-cup-india-and-pakistan-fixure-after-itf-moves-match-from-islamabad-to-kazakhstan-over-security
డెవిస్​ కప్​: నేడే భారత్​-పాకిస్థాన్​ మధ్య పోరు

By

Published : Nov 29, 2019, 8:56 AM IST

నూర్‌-సుల్తాన్‌ (కజకిస్థాన్‌)లో శుక్రవారం ఆరంభమయ్యే డెవిస్‌కప్‌ పోరులో భారత్​, పాకిస్థాన్​ తలపడనున్నాయి.ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. సుమిత్‌ నగాల్‌, రామ్‌కుమార్‌ రామనాథన్‌, వెటరన్‌ ఆటగాడు లియాండర్‌ పేస్‌లతో భారత జట్టు బలంగా ఉంది. మామూలుగానే పాకిస్థాన్‌పై అలవోకగా గెలిచే జట్టిది.

భద్రతా కారణాల వల్ల ఇస్లామాబాద్​(పాకిస్థాన్​)లో జరగాల్సిన ఈ మ్యాచ్ వేదిక మార్చాలని భారత్​ కోరగా... అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) అందుకు ఒప్పుకొంది. ఈ నిర్ణయాన్ని పాక్‌ అగ్రశేణి ఆటగాళ్లు ఐసాముల్‌ హక్‌ ఖురేషి, అకీల్‌ ఖాన్‌ వ్యతిరేకిస్తూపోరు నుంచి వైదొలిగారు. ఫలితంగా ఈ మ్యాచ్​కు యువ జట్టును పంపుతోంది దాయాది దేశం.

పాకిస్థాన్​, భారత్​ జట్లు

ఈ పోరులో గెలిచిన జట్టు ప్రపంచ గ్రూప్‌ క్వాలిఫయర్స్‌లో ఆడేందుకు మార్చిలో క్రొయేషియా వెళ్తుంది. శుక్రవారం తొలి సింగిల్స్‌లో షోయబ్‌తో రామ్‌కుమార్‌ తలపడతాడు. రెండో సింగిల్స్‌లో అబ్దుల్‌ రెహ్మాన్‌తో సుమిత్‌ నగాల్‌ ఢీకొంటాడు. శనివారం డబుల్స్‌, రివర్స్‌ సింగిల్స్‌ జరుగుతాయి. డబుల్స్‌లో పేస్‌... జీవన్‌ నెదుంచెజియన్‌తో కలిసి బరిలోకి దిగనున్నాడు.

ABOUT THE AUTHOR

...view details