యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్(Us Open Results) పోరులో రష్యా ఆటగాడు డానిల్ మెద్వెదెవ్(Daniil Medvedev) అద్భుతం చేశాడు. తన కేరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్(Grand Slam) సాధించాడు. అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు, అర్ధశతాబ్దం తర్వాత కేరీర్ గ్రాండ్‌స్లామ్(Career Grand Slam) సాధించి చరిత్ర తిరగరాద్దమనుకున్న ప్రపంచ నంబర్‌వన్ నోవాక్ జకోవిచ్‌కు షాక్ ఇచ్చాడు. యూఎస్ ఓపెన్ ఫైనల్‌లో మెద్వెదెవ్ 6-4, 6-4, 6-4 తేడాతో 34 ఏళ్ల జకోవిచ్‌ను ఓడించి అతడి జోరుకు బ్రేకులు వేశాడు. దీంతో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించేందుకు జకోవిచ్ ఇంకొన్ని రోజులపాటు నిరీక్షించాల్సిన పరిస్థితి ఎదురైంది. ఇప్పటికే జకోవిచ్ 20 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో రోజర్ ఫెదరర్(Roger Federer Records), నాదల్ సరసన చేరాడు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి టెన్నిస్ చరిత్రలో కొత్త అధ్యయనాన్ని లిఖిద్దామనకుంటే జకోకు నిరాశే ఎదురైంది.
న్యూయార్క్ సిటీలోని ఆర్థర్ ఆషే స్టేడియంలో(Arthur Ashe Stadium) అభిమానుల కోలాహాలం మధ్య, అత్యంత ఉత్కంఠగా ఈ మ్యాచ్ ప్రారంభమైంది. ఆట ప్రారంభమైనప్పటి నుంచి ఇద్దరు ఆటగాళ్లు నువ్వానేనా అన్నట్లు ఆడారు. తొలిసెట్‌లో 6-4 తేడాతో మెద్వెదెవ్‌దే పైచేయి సాధించినప్పటికీ రెండో సెట్‌లో ఇద్దరు ఆటగాళ్లు బలమైన షాట్లు, సర్వీస్ బ్రేక్‌లతో ఆటను ఉత్కంఠ స్థితికి తీసుకొచ్చారు. అయితే జకోవిచ్‌కు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా 25 ఏళ్ల మెద్వెదెవ్ 6-4 తేడాతో రెండో సెట్‌ను కూడా గెలిచాడు.