తెలంగాణ

telangana

ETV Bharat / sports

టెన్నిస్ సంచలనం కోరీ గాఫ్​కు తొలి టైటిల్ - cori gauff tennis

యువ టెన్నిస్ క్రీడాకారిణి కోరీ గాఫ్.. తొలి డబ్ల్యూటీఏ టైటిల్​ గెలుపొందింది. 1991 తర్వాత ఈ ఘనత సాధించిన అమెరికన్ టీనేజర్​గా ఘనత సాధించింది.

టెన్నిస్ క్రీడాకారిణి కోరీగాఫ్

By

Published : Oct 14, 2019, 10:05 AM IST

భవిష్యత్తు టెన్నిస్​ తారగా గుర్తింపు తెచ్చుకుంటున్న కోరీ గాఫ్.. తొలి డబ్ల్యూటీఏ టైటిల్​ గెల్చుకుంది. ఆదివారం జరిగిన అప్పర్ ఆస్ట్రేలియా లేడీస్​ టోర్నీలో జెలెనా ఒస్టాపెంకోపై 6-3,1-6, 6-2 తేడాతో విజయం సాధించింది. 1991 తర్వాత అతి తక్కువ వయసులోనే సింగిల్స్​ టైటిల్​ సాధించిన అమెరికన్ టెన్నిస్​ ప్లేయర్​గా గుర్తింపు పొందింది. ఈ విజయంతో 71వ ర్యాంకుకు చేరుకుంది.

అమెరికాకు చెందిన జెన్నిఫర్ కప్రియాతీ.. పిన్న వయసులో టైటిల్​ సాధించింది. ఇప్పుడు ఆ స్థానాన్ని 15 ఏళ్ల కోరీ గౌఫ్ చేజిక్కుంచుకుంది. ప్రముఖ క్రీడాకారిణులు వీనస్, సెరెనా 17 సంవత్సరాల వయసులో తొలి టైటిల్స్​ సాధించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details