తెలంగాణ

telangana

వింబుల్డన్​లో దూసుకెళ్తోన్న కోరీ గాఫ్​

By

Published : Jul 5, 2019, 6:32 AM IST

ప్రతిష్ఠాత్మక గ్రాండ్​స్లామ్ టోర్నీ వింబుల్డన్​లో అమెరికా యువ క్రీడాకారిణి కోరీ గాఫ్‌ వరుస విజయాలు సాధిస్తోంది. ఈ టోర్నీలో పిన్నవయస్కురాలిగా అడుగుపెట్టిన ఈ క్రీడాకారిణి.. రాబ్రీకోవా (స్లొవేకియా)పై గెలిచి మూడో రౌండ్​కు చేరింది. మరో క్రీడాకారిణి, మాజీ ఛాంపియన్​​ కెర్బర్​ (జర్మనీ) రెండో రౌండ్​లో లారెన్​ డేవిస్​(అమెరికా) చేతిలో ఓడి ఇంటి ముఖం పట్టింది.

వింబుల్డన్​లో దూసుకెళ్తోన్న కోరీ గాఫ్​

కోరీ గాఫ్​ విజయం

టెన్నిస్​ గ్రాండ్​స్లామ్​ టోర్నీ వింబుల్డన్​లో కోరీ గాఫ్​(​అమెరికా) దూసుకెళ్తోంది. 15 ఏళ్ల వయసులోనే మెయిన్​ డ్రాకు అర్హత సాధించిన గాఫ్​... గురువారం జరిగిన రెండో రౌండ్​లో తనకన్నా మెరుగైన రాబ్రీకోవా (స్లొవేకియా)ను 6-3, 6-3తో ఓడించింది. రాబ్రీ ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్​లో 313 స్థానంలో ఉంది. 2019లో సెమీఫైనల్​ వరకు వెళ్లింది. అంతటి మేటి క్రీడాకారిణిపై గెలిచి సత్తా చాటింది గాఫ్​. ఈ విజయంతో 1991 తర్వాత ఈ గ్రాండ్​ ఛాంపియన్‌షిప్​లో 3వ రౌండ్‌కు చేరిన యువ క్రీడాకారిణిగానూ ఘనత సాధించింది. ఈ టోర్నీ తొలి రౌండ్​లో 5 సార్లు వింబుల్డన్​ ఛాంపియన్​ వీనస్​ విలియమ్స్​ను మట్టికరిపించింది కోరీ గాఫ్​.

కెర్బర్​ ఔట్​...

వింబుల్డన్​ నుంచి జర్మనీ భామ కెర్బర్​ నిష్క్రమించింది. ఈ మాజీ ఛాంపియన్​కు లారెన్​ డేవిస్(అమెరికా) షాకిచ్చింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్​ రెండో రౌండ్లో కెర్బర్​ 6-2, 2-6, 1-6 తేడాతో లారెన్​ డేవిస్​ చేతిలో ఓడింది.

టాప్​సీడ్​ బార్టీ మూడో రౌండ్లో అడుగుపెట్టింది. ఆమె 6-1, 6-3 తేడాతో యుట్​వాక్​(బెల్జియం)పై గెలిచింది. అమెరికా తార సెరెనా విలియమ్స్​ 2-6, 6-2, 6-2 తేడాతో జువాన్​(స్లొవేనియా)పై చెమటోడ్చి గెలిచింది. క్విటోవా(చెక్​ రిపబ్లిక్​), కొంటా (బ్రిటన్​), బెర్టిన్స్​(నెదర్లాండ్స్​), స్లోన్​ స్టీఫెన్స్​(అమెరికా) మూడో రౌండ్​ చేరారు.

ABOUT THE AUTHOR

...view details