తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఆడాలంటే పరిస్థితులు చక్కబడాల్సిందే' - రఫెల్ నాదల్ యూఎస్ ఓపెన్

ఇప్పట్లో టెన్నిస్ ఆడటం కుదరకపోవచ్చని చెప్పిన నాదల్.. యూఎస్​ ఓపెన్​ ఈ ఏడాది జరిగినా పాల్గొనాలనుకోవట్లేదని చెప్పాడు.

Can't play until the situation is completely safe: Rafael Nadal
ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ రఫెల్ నాదల్

By

Published : Jun 5, 2020, 9:01 PM IST

ప్రస్తుతమున్న పరిస్థితులు అదుపులోకి వచ్చేంతవరకు ఆడటం వీలుపడదని ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు రఫెల్ నాదల్ చెప్పాడు. అదేవిధంగా టెన్నిస్ ప్రారంభం కావాలన్న సాధారణ పరిస్థితులు రావాలని అభిప్రాయపడ్డాడు. యూఎస్ ఓపెన్ ఒకవేళ జరిగినా తాను పాల్గొనాలనుకోవట్లేదని స్పష్టం చేశాడు. తాజాగా జరిగిన ఓ వీడియో కాన్ఫరెన్స్​లో మాట్లాడుతూ ఈ విషయాల్ని వెల్లడించాడు.

ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ రఫెల్ నాదల్

కరోనా ప్రభావంతో మార్చి నుంచి ప్రపంచవ్యాప్తంగా మ్యాచ్​లు నిలిచిపోయాయని, టెన్నిస్ క్యాలెండర్​లోని టోర్నీలు జరిగేది అనుమానంగా మారిందని ప్రపంచ రెండో ర్యాంకర్ అయిన నాదల్ చెప్పాడు. ప్రతిష్టాత్మక వింబుల్డన్ టోర్నీ.. రెండో ప్రపంచయుద్ధం తర్వాత మళ్లీ ఇప్పుడే రద్దయింది. ఇప్పటికే వాయిదా పడ్డ ఫ్రెంచ్ ఓపెన్ సెప్టెంబరులో ఉండనుందని టెన్నిస్ సమాఖ్య తెలిపింది.

ఇవి చదవండి:

ABOUT THE AUTHOR

...view details