యూఎస్ ఓపెన్ 2020 పురుషుల డబుల్స్ విభాగంలో ఇండో కెనడియన్ రోహన్ బోపన్న-డెనిస్ షాపోవాలో జోడి క్వార్టర్ ఫైనల్లో ఓటమిపాలైంది. దీంతో మెగా గ్రాండ్ స్లామ్‌లో భారత్ ఆశలు గల్లంతయ్యాయి. సోమవారం రాత్రి నెదర్లాండ్స్, రొమానియాకు చెందిన జీన్ జూలియన్-హోరియా టెకావుతో తలపడిన క్వార్టర్స్‌లో బోపన్న-డెనిస్ జోడి 5-7,5-7 తేడాతో విఫలమైంది. వీరిద్దరూ ప్రత్యర్థులపై అద్భుతంగా పోరాడినా కీలక సమయంలో చేతులెత్తేశారు. దీంతో అనూహ్యంగా ఓటమిపాలయ్యారు.
యూఎస్ ఓపెన్: బోపన్న ఓటమితో భారత్ ఆశలు గల్లంతు.. - bopanna shapovalov news
ప్రతిష్టాత్మక టెన్నిస్ టోర్నీ యూఎస్ ఓపెనలో భారత్‌కు నిరాశ ఎదురైంది. పురుషుల డబుల్స్ విభాగంలో పతక ఆశలు రేపిన బోపన్న జోడి ఓటమిపాలైంది. క్వార్టర్స్‌లో జీన్ జూలియన్-హోరియా టెకావు చేతిలో పరాజయం చెందింది.
యూఎస్ ఓపెన్‌లో భారత్ ఆశలు గల్లంతు..
అంతకుముందు ఆడిన రెండో రౌండ్‌లో ఈ ఇండో కెనడియన్ పెయిర్ ఆరో సీడ్ కెవిన్ క్వావీ, ఆండ్రియా మైల్స్‌ను ఓడించిన సంగతి తెలిసిందే. బోపన్న ఓటమితో యూఎస్ ఓపెన్‌లో భారత్ అవకాశాలు పూర్తిగా మూసుకుపోయాయి. ఇదివరకే పురుషుల సింగిల్స్ విభాగంలో భారత టాప్ సీడ్ సుమిత్ నగల్ రెండో రౌండ్ నుంచే నిష్క్రమించాడు. ఆ మ్యాచ్‌లో అతడు డొమినిక్ థీమ్ చేతిలో ఓటమిపాలయ్యాడు.