తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఇటాలియన్ ఓపెన్ నుంచి బోపన్న జోడీ ఔట్ - బోపన్న-షపోవలోవ్

ఇటాలియన్ ఓపెన్​లో ఇండో-కెనడియన్ ద్వయం బోపన్న-డెనిస్ షెపోవలోవ్ క్వార్వర్ట్స్​లోనే నిష్క్రమించింది. ఫ్రెంచ్ జోడీ జెరెమీ చార్డీ-ఫాబ్రిస్ మార్టిన్ చేతిలో 6-4, 5-7, 7-10 తేడాతో పోరాడి ఓడిపోయారు.

Bopanna-Shapovalov bow out of Italian Open, suffer defeat in quarterfinals
ఇటాలియన్ ఓపెన్ నుంచి బోపన్న జోడీ ఔట్

By

Published : Sep 19, 2020, 11:58 AM IST

ఇటాలియన్ ఓపెన్​లో బోపన్న జోడీకి ఓటమి ఎదురైంది. కెనడా ఆటగాడు డెనిస్ షపోవలోవ్​తో కలిసి బరిలోకి దిగిన బోపన్న క్వార్టర్ ఫైనల్లో ఓటమి చవిచూశాడు. ఫ్రెంచ్ ద్వయం జెరెమీ చార్డీ-ఫాబ్రిస్ మార్టిన్ చేతిలో 6-4, 5-7, 7-10 తేడాతో పోరాడి ఓడిపోయారు.

ఈ టోర్నీలో అన్​సీడెడ్​గా బరిలో దిగిన బోపన్న-డెనిస్ జోడీ రెండో రౌండ్​రో టాప్ సీడ్​ జ్వాన్ సెబాస్టియన్-రాబర్ట్ ఫరాపై గెలిచి అందరికీ షాకిచ్చింది. కానీ యూఎస్ ఓపెన్ మాదిరిగానే మరోసారి క్వార్టర్స్​లోనే నిష్క్రమించింది.

ఇటీవల జరిగిన యూఎస్ ఓపెన్​లో బోపన్న-డెనిస్ ద్వయం క్వార్టర్స్​లో జీన్-జులియన్ రోజర్ చేతిలో 5-7, 5-7 తేడాతో ఓటమి పాలైంది.

ABOUT THE AUTHOR

...view details