ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో భారత్ కథ ముగిసింది. ఇప్పటికే మహిళల, పురుషుల డబుల్స్ ఈవెంట్లో భారత జోడీలు ఓటమి చెందగా.. తాజాగా మిక్స్డ్ డబుల్స్‌లో బోపన్న జోడీ తొలి రౌండ్లోనే నిష్క్రమించింది.
రోహన్ బోపన్న- యింగింగ్ డ్యువాన్(చైనా) జోడీ.. బెథాని మాటెక్ సాండ్స్(అమెరికా), జేమీ ముర్రే(యూకే) జంటపై 4-6, 4-6 తేడాతో వరుస సెట్లతో పరాజయం పాలైంది.
అంతకుముందు 4-6, 6-7 తేడాతో పురుషుల డబుల్స్‌లోనూ ఓడింది బోపన్న- బెన్ మెక్లచ్లాన్(జపాన్) జంట.
అంకితా, దివిజ్ ఇప్పటికే..
ఇప్పటికే భారత ప్లేయర్లు అంకితe రైనా, దివిజ్లు తమ తమ పార్ట్నర్లతో మహిళల, పురుషుల డబుల్స్‌లో తొలి రౌండ్లోనే ఓడి ఇంటి బాట పట్టారు.
అంకిత.. గ్రాండ్‌స్లామ్ మెయిన్ డ్రాలో భారత్ తరఫున అర్హత సాధించిన ఐదో మహిళ మాత్రమే కావడం విశేషం. ఆమె.. మహిళల డబుల్స్‌లో ఆస్ట్రేలియాకు చెందిన జోడీ ఒలీవియా, బెలిండా చేతిలో తన భాగస్వామి మిహేలా(రొమేనియా)తో కలిసి 3-6, 0-6 తేడాతో పరాజయం పాలైంది.
పురుషుల డబుల్స్‌లో.. దివిజ్ జర్మనీ ద్వయం యాన్నిక్, కెవిన్ చేతుల్లో తన పార్ట్నర్ ఇగోర్ జీలెనేతో కలిసి 1-6, 4-6 తేడాతో ఓడిపోయాడు.
ఇదీ చదవండి:గాయపడ్డ జకోవిచ్.. ఆస్ట్రేలియా ఓపెన్‌కు దూరం!