ఈ ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల డబుల్స్‌లో పోటీపడేందుకు భారత ఆటగాడు రోహన్ బోపన్నకు జోడీ కుదిరింది. జపాన్‌కు చెందిన బెన్ మెక్లాచ్లన్తో అతను జతకట్టనున్నాడు. జావో సోసా (పోర్చుగల్)తో కలిసి బోపన్న ఆడాల్సింది. కానీ అతనికి కరోనా సోకడం వల్ల టోర్నీ నుంచి తప్పుకున్నాడు. మరోవైపు బెన్ భాగస్వామి రావెన్ కూడా పోటీ నుంచి వైదొలిగాడు.
"అదృష్టవశాత్తూ నాకు భాగస్వామి దొరికాడు. బెన్‌తో కలిసి ఆడే రావెన్ వైరస్‌తో టోర్నీ నుంచి తప్పుకోవడం వల్ల అతను మరో భాగస్వామి కోసం వెతుకుతున్నట్లు తెలిసింది. దీంతో మేం కలిసి ఆడాలని నిర్ణయించుకున్నాం" అని 14 రోజుల కఠిన క్వారంటైన్ పూర్తి చేసుకున్న బోపన్న తెలిపాడు.