యూఎస్ ఓపెన్‌లో (US Open 2021) టైటిల్‌పై గురి పెట్టిన ప్రపంచ నంబర్‌వన్ ఆష్లీ బార్టీ (Ashleigh Barty) (ఆస్ట్రేలియా) ఆ దిశగా మరో అడుగు ముందుకేసింది. ఈ టాప్‌సీడ్ పెద్దగా కష్టపడకుండానే మూడో రౌండ్లో ప్రవేశించింది. గురువారం మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో 6-1, 7-5తో టౌసన్ను (డెన్మార్క్) ఓడించింది. బెన్సిచ్ (స్విట్జర్లాండ్), సకారి (గ్రీస్) కూడా మూడో రౌండ్లో అడుగుపెట్టారు. బెన్సిచ్ 6-3, 6-1తో ట్రెవిసన్ (ఇటలీ)పై గెలవగా, సకారి 6-4, 6-2తో సినియాకోవాను (చెక్ రిపబ్లిక్) ఓడించింది. రెండో సీడ్ సబలెంక (బెలారస్), అయిదో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్), అజరెంకా (బెలారస్) మూడో రౌండ్ చేరారు.
సిట్సిపాస్ ముందుకు
పురుషుల సింగిల్స్‌లో గ్రీస్ కుర్రాడు స్టెఫానోస్ సిట్సిపాస్ మూడో రౌండ్లో ప్రవేశించాడు. రెండో రౌండ్లో ఈ మూడో సీడ్ 6-3, 6-4, 6-7 (4/7), 6-0తో మనారినోపై (ఫ్రాన్స్) నెగ్గాడు. మరో పోరులో పదకొండో సీడ్ ష్వార్జ్‌మ్యాన్ 7-6 (7/4), 6-3, 6-4తో కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా)ను ఓడించాడు. డబుల్స్‌లో అంకిత రైనా, దివిజ్ శరణ్ తొలి రౌండ్లోనే ఓడిపోయారు. దివిజ్-క్వాన్ (కొరియా) జంట 3-6, 4-6తో నాలుగో సీడ్ జోడీ ఆండీ రామ్ (అమెరికా)-సాలిస్‌బరీ (బ్రిటన్) చేతిలో పరాజయం చవిచూసింది. మహిళల డబుల్స్‌లో అంకిత-కేథరినా 1-6, 1-6తో ఎనిమిదో సీడ్ జంట డారియా జురాక్ (క్రొయేషియా)-అండ్రియా క్లెపాక్ (స్లొవేకియా) చేతిలో పరాజయం పాలయ్యారు.
ఇదీ చూడండి:US Open 2021: జకోవిచ్ శుభారంభం- మూడో రౌండ్లో ఒసాకా, ముగురుజ