తెలంగాణ

telangana

ETV Bharat / sports

టెన్నిస్​ ర్యాంకింగ్స్​​: అగ్రస్థానంలో బార్టీ, జకోవిచ్​ - డొమినిక్​ థీమ్

డబ్ల్యూటీఏ విడుదల చేసిన ర్యాంకింగ్స్​లో మహిళల విభాగంలో బార్టీ, పురుషుల్లో జకోవిచ్​ అగ్రస్థానాల్లో నిలిచారు. బార్టీ 8,717 పాయింట్లతో, జకోవిచ్ 10,220 పాయింట్లతో మొదటి ర్యాంకుల్లో ఉన్నారు.

Barty, Djokovic retain top spot in tennis rankings
టెన్నిస్​ ర్యాంకింగ్​లో అగ్రస్థానంలో బార్టీ, జొకోవిచ్​

By

Published : Mar 3, 2020, 5:33 PM IST

డబ్ల్యూటీఏ విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్​లో బార్టీ 8,717 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. రొమేనియాకు చెందిన సిమోనా హలెప్​ 6,076 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. పురుషుల విభాగంలో సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్‌కు ఈ ఏడాది బాగా కలిసివస్తోంది. ఆస్ట్రేలియా ఓపెన్, దుబాయ్ ఛాంపియన్‌షిప్‌లలో మంచి విజయాలు సాధించిన జకో ఏటీపీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని నిలుపుకోగలిగాడు. .

టెన్నిస్​ ర్యాంకింగ్​లో అగ్రస్థానంలో బార్టీ, జొకోవిచ్​

స్విట్జర్లాండ్‌కు చెందిన బెలిండా బెన్సిక్ టాప్ 10 ఆటగాళ్లలో చోటు దక్కించుకుంది. తొమ్మిదో స్థానంలో ఉన్న ఈమె ఎనిమిదో స్థానానికి చేరుకుంది. రష్యన్ స్వెత్లానా కుజ్నెత్సోవా 32, బ్రిటన్ హీథర్ వాట్సన్ 49వ స్థానాల్లో నిలిచారు.

ఏటీపీ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రియాకు చెందిన డొమినిక్ థీమ్ మూడో స్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం మోకాలి గాయంతో ఆటకు దూరమైన థీమ్ జూన్​లో మళ్లీ బరిలో దిగనున్నాడు. దుబాయ్ టైటిల్‌ను గెలుచుకున్న జకోవిచ్ 10,220 పాయింట్లతో అగ్రస్థానంలో, నాదల్ 9,850 పాయింట్లతో రెండవ స్థానంలో నిలిచారు.

ఇదీ చదవండి:టీ20 ప్రపంచకప్​ సెమీస్​ ముంగిట ఆసీస్​కు షాక్​

ABOUT THE AUTHOR

...view details