తెలంగాణ

telangana

ETV Bharat / sports

Wimbledon: వింబుల్డన్​ విజేతగా​ బార్టీ - గ్రాండ్​ స్లామ్​ టైటిల్​ విన్నర్​ బార్టీ

వింబుల్డన్​ ఫైనల్​లో గెలిచిన టాప్‌ సీడ్‌ ప్లేయర్ ఆష్లే బార్టీ(ఆస్ట్రేలియా) కెరీర్​లో గ్రాండ్​స్లామ్​ టైటిల్​ను రెండోసారి ముద్దాడింది.​​ వింబుల్డన్​ తుదిపోరులో ప్లిస్కోవాపై ఆమె విజయం సాధించింది.

Wimbledon: గ్రాండ్​ స్లామ్​ టైటిల్​ విజేతగా బార్టీ
బార్టీ

By

Published : Jul 10, 2021, 9:23 PM IST

Updated : Jul 10, 2021, 10:16 PM IST

వింబుల్డన్‌లో(Wimbledon) మహిళల సింగిల్స్‌ ఆఖరి అంకం ముగిసింది. తుది పోరులో టాప్‌ సీడ్‌ ఆష్లే బార్టీ (ఆస్ట్రేలియా) విజేతగా నిలిచి, కెరీర్​లో రెండో గ్రాండ్​స్లామ్​ టైటిల్​ను దక్కించుకుంది. చివరిసారిగా 2019 ఫ్రెంచ్​ ఓపెన్​ టైటిల్​ ఈమెకు వరించింది.

బార్టీ

శవివారం జరిగిన ఫైనల్​లో ఎనిమిదో సీడ్‌ ప్లిస్కోవా (చెక్‌ రిపబ్లిక్)ను 6-3,6-7(4),6-3 తేడాతో మట్టికరిపించింది. తొలిసెట్‌లో అలవోకగా గెలిచిన ఈ ఆస్ట్రేలియా ప్లేయర్ రెండో సెట్‌లో కాస్త తడబడిపోయింది. దాంతో ప్లిస్కోవా పైచేయి సాధించి మ్యాచ్‌ను ఉత్కంఠస్థితికి తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలోనే మూడోసెట్‌ అనివార్యమవ్వగా ఈసారి బార్టీ ఆధిపత్యం చెలాయించింది. చివరికి తన కలను నిజం చేస్తూ టైటిల్‌ ఎగరేసుకుపోయింది. 1980 తర్వాత ఆల్ ఇంగ్లాండ్​ క్లబ్​లో సింగిల్స్​లో ట్రోఫీలో గెలుచుకున్న తొలి ఆస్ట్రేలియన్​గా నిలిచింది​.

మరోవైపు వింబుల్డన్‌ బాలుర విభాగంలో ఇండో-అమెరికన్‌ సమీర్‌ బెనర్జీ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. అతడు సెమీస్‌లో గీమార్ట్ వేయన్‌బర్గ్‌పై విజయం సాధించాడు.

ఇదీ చూడండి: ఫ్రెంచ్‌ ఓపెన్: అప్పుడు 5 లక్షలు.. ఇప్పడు 5 వేలు

Last Updated : Jul 10, 2021, 10:16 PM IST

ABOUT THE AUTHOR

...view details