ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి భారత టెన్నిస్ ప్లేయర్లు దివిజ్ శరణ్, అంకిత రైనా నిష్క్రమించారు. గురువారం జరిగిన తొలి రౌండ్లో పురుషుల డబుల్స్‌లో దివిజ్, మహిళల డబుల్స్‌లో అంకిత వరుస సెట్లలో ఓడిపోయారు.
అరంగేట్రంలో నిరాశ..
అంకిత.. గ్రాండ్‌స్లామ్ మెయిన్ డ్రాలో భారత్ తరఫున పోటీ చేస్తున్న ఐదో మహిళమాత్రమే కావడం విశేషం. ఆస్ట్రేలియాకు చెందిన జోడీ ఒలీవియా గడెక్కీ, బెలిండా వూల్‌కాక్ చేతిలో తన భాగస్వామి మిహేలాతో కలిసి 3-6, 0-6 తేడాతో పరాజయం పాలైంది అంకిత.
పురుషుల డబుల్స్‌లోనూ దివిజ్ నిష్క్రమణతో భారత్ కథ ముగిసింది. జెర్మనీ ద్వయం యాన్నిక్, కెవిన్ చేతుల్లో తన పార్ట్నర్ ఇగోర్ జీలెనేతో కలిసి 1-6, 4-6 తేడాతో ఓడిపోయాడు దివిజ్.
మిగిలింది ఒక్కడే..
ఇక ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో భారత్ తరఫున మిగిలింది సీనియర్ బోపన్న మాత్రమే. పురుషుల డబుల్స్‌లో బుధవారం తొలి రౌండ్లోనే ఓటమి పాలైన బోపన్న.. మిక్స్డ్ డబుల్స్‌లో పోటీ పడనున్నాడు. చైనాకు చెందిన యింగ్యింగ్తో కలిసి అమెరికా జోడీ మాటెక్ సాండ్స్, జామీ ముర్రేతో తొలి రౌండ్లో తలపడనున్నాడు.
ఇదీ చూడండి:ఆస్ట్రేలియన్ ఓపెన్: మూడో రౌండ్‌కు సెరెనా, జకోవిచ్