వచ్చే ఏడాది జనవరిలో జరగాల్సిన ఆస్ట్రేలియా ఓపెన్.. నిర్దేశిత షెడ్యూల్ కంటే ఆలస్యంగా ప్రారంభం కానుంది. కరోనా వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో.. షెడ్యూల్ తేదీలను మార్చుతూ ఏటీపీ(అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్) నిర్ణయం తీసుకుంది.
ఫిబ్రవరిలో ఆస్ట్రేలియన్ ఓపెన్ - corona effect on australia open
కరోనా కారణంగా వాయిదా పడిన ఆస్ట్రేలియా ఓపెన్ షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేశారు నిర్వాహకులు. ఫిబ్రవరిలో టోర్నీ ప్రారంభమవుతుందని వెల్లడించారు.
ఫిబ్రవరిలో జరగనున్న ఆస్ట్రేలియా ఓపెన్
టెన్నిస్ గ్రాండ్‌స్లామ్‌లలో మొదటగా నిర్వహించే ఆస్ట్రేలియా ఓపెన్.. ఫ్రిబ్రవరి 8 నుంచి మొదలు కానుంది. షెడ్యూల్ ప్రకారం జనవరి 18న ప్రారంభం కావాల్సిన మ్యాచ్‌లను ఫిబ్రవరి 8 నుంచి 21 వరకు నిర్వహిస్తున్నట్లు ఏటీపీ ప్రకటించింది. ఈ మేరకు 2021 టూర్ క్యాలెండర్‌ను విడుదల చేసింది.
ఇదీ చూడండి:టోక్యో ఒలింపిక్స్‌కు లియాండర్ పేస్.. ఆడితే రికార్డే