తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆస్ట్రేలియన్ ఓపెన్: నాలుగో రౌండ్​కు సెరెనా - ఆస్ట్రేలియన్ ఓపెన్

ఆస్ట్రేలియన్​ ఓపెన్​లో వరుస విజయాలతో దూసుకుపోతోంది టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్. శుక్రవారం జరిగిన మ్యాచ్​లో రష్యా యువ క్రీడాకారిణి అనటేసియాపై వరుస సెట్లలో నెగ్గి నాలుగో రౌండ్​కు అర్హత సాధించింది.

australian open serena williams cruises into fourth round with 90th win
ఆస్ట్రేలియన్ ఓపెన్: నాలుగో రౌండ్​కు దూసుకెళ్లిన సెరెనా

By

Published : Feb 12, 2021, 3:22 PM IST

ఆస్ట్రేలియన్​ ఓపెన్​లో నాలుగో రౌండ్​కు చేరింది అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్. శుక్రవారం జరిగిన మూడో రౌండ్​లో రష్యా ప్లేయర్​ అనటేసియా పొటపోవాపై వరుస సెట్లలో 7-6(5), 6-2తో గెలిచింది. దీంతో ఈ గ్రాండ్​స్లామ్​లో తన 90వ విజయం నమోదు చేసింది సెరెనా.

తొలి సెట్​లో యువ క్రీడాకారిణి అనటేసియా.. సెరెనాకు గట్టి పోటీ ఇచ్చింది. అయితే రెండో సెట్​కు వచ్చేసరికి సెరెనా అనుభవం ముందు నిలవలేకపోయింది. క్వార్టర్​ ఫైనల్లో అర్హత కోసం ఆదివారం జరిగే మ్యాచ్​లో అరైనా సబలెంకతో తలపడనుంది సెరెనా.

ఇదీ చూడండి:ఆస్ట్రేలియన్​ ఓపెన్​ నుంచి దివిజ్, అంకిత ఔట్

ABOUT THE AUTHOR

...view details