తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆస్ట్రేలియా ఓపెన్: వీనస్ ఇంటిముఖం.. స్టార్ ప్లేయర్ల ముందంజ - Denis Shapovalov bows out

ఆస్ట్రేలియా ఓపెన్​ తొలిరోజు స్టార్ ప్లేయర్లు ముందంజ వేశారు. అమెరికా ఫేమస్ టెన్నిస్ క్రీడాకారిణి వీనస్ విలియమ్స్​ మొదటి రౌండ్​లోనే ఓడి ఇంటిముఖం పట్టింది.

Roger Federer
టెన్నిస్

By

Published : Jan 21, 2020, 5:42 AM IST

Updated : Feb 17, 2020, 8:00 PM IST

ఆస్ట్రేలియా ఓపెన్​లో స్టార్ ఆటగాళ్లు ఫెదరర్, జకోవిచ్, ఓజ్నియాకి, సెరెనా విలియమ్స్ నయోమీ ఒసాకా రెండో రౌండ్​లోకి ప్రవేశించారు. మహిళల సింగిల్స్​లో అమెరికా స్టార్ టెన్నిస్ ప్లేయర్ వీనస్ విలియమ్స్​ తొలి రౌండ్​లోనే ఓడి ఇంటిముఖం పట్టింది.

ఫెదరర్, జకోవిచ్, సిట్సిపాస్, దిమిత్రోవ్ ముందంజ

మొదటి రౌండ్​లో ఫెదరర్ సునాయాస విజయం సాధించాడు. స్టీవ్ జాన్సన్​పై 6-2, 6-2 తేడాతో గెలిచి తన ప్రారంభాన్ని అదిరేలా చాటిచెప్పాడు. డిఫెండింగ్ ఛాంపియన్ జకోవిచ్​ కాస్త శ్రమించాడు. ఇతడు జాన్ లెన్నార్డ్​పై 7-6 (5), 6-2, 2-6, 6-1 తేడాతో గెలిచి ఊపిరిపీల్చుకున్నాడు. తొలి రౌండ్ హోరాహోరీగా జరగగా రెండో రౌండ్​లో సునాయాసంగా గెలిచాడు జకో. మూడో రౌండ్​లో జాన్ ఆధిపత్యం వహించాడు. కానీ ఆఖరి రౌండ్​లో మరోసారి తన సత్తాచాటి విజయాన్ని కైవసం చేసుకున్నాడీ సెర్బియా స్టార్.

దిమిత్రోవ్ మొదటి రౌండ్​లో తన సూట్​తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. జాకెట్​ అండ్ ప్యాంట్​తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. ఇగ్వాకో లాండరేతో జరిగిన మ్యాచ్​లో దిమిత్రోవ్ 4-6, 6-2, 6-0, 6-4 తేడాతో గెలిచాడు. మరో ఆటగాడు సిట్సిపాస్ 6-0, 6-2, 6-3 తేడాతో సల్వటోరె మార్గరెట్​పై విజయం సాధించి రెండో రౌండ్​లోకి ప్రవేశించాడు.

మహిళల సింగిల్స్​లో సంచలనం

ఆస్ట్రేలియా ఓపెన్‌ ప్రారంభ రోజే సంచలన విజయం నమోదైంది. అమెరికా టీనేజ్‌ గర్ల్ కోరి గాఫ్‌ అద్భుత విజయాన్ని సాధించింది. అమెరికాకే చెందిన మాజీ వరల్డ్ నంబర్ వన్ వీనస్ విలియమ్స్‌ను తొలి రౌండ్‌లోనే ఓడించింది. 15 ఏళ్ల గాఫ్‌ 7-6(5), 6-3తో వీనస్​ను మట్టికరిపించింది. మరో టాప్ క్రీడాకారిణి ఆష్లే బార్టే రెండో రౌండ్​లోకి ప్రవేశించింది. లీసా సురెంకోతో జరిగిన మ్యాచ్​లో తొలి సెట్లో ఓడినా.. తర్వాత పుంజుకుని మ్యాచ్​ను కైవసం చేసుకుంది. 5-7, 6-1, 6-1 తేడాతో గెలిచి రెండో రౌండ్​లోకి ప్రవేశించింది.

టాప్ ప్లేయర్ల దూకుడు

మాజీ నెంబర్​వన్ కరోలిన్ ఓజ్నియాకి కూడా రెండో రౌండ్​లోకి ప్రవేశించింది. క్రిస్టీ ఆన్​తో జరిగిన మ్యాచ్​లో 6-1, 6-3 తేడాతో గెలిచింది. మరో టాప్​ ప్లేయర్ సెరెనా విలియమ్స్ సునాయాస విజయంతో రెండో రౌండ్​లోకి ప్రవేశించింది. అనస్టాసియా పొటపోవాతో జరిగిన మ్యాచ్​ను 6-0, 6-3 తేడాతో గెలుచుకుంది. ఈ మ్యాచ్​ 19 నిమిషాల్లో ముగిసింది. డిఫెండింగ్ ఛాంపియన్ నయమీ ఒసాకా తర్వాత రౌండ్​లోకి ప్రవేశించింది. మారీ బౌజ్కోవాతో జరిగిన మ్యాచ్​లో 6-2, 6-4 తేడాతో గెలిచింది.

ఇవీ చూడండి.. 'బుట్టబొమ్మ'కు మరింత సాహిత్యం తోడైతే..

Last Updated : Feb 17, 2020, 8:00 PM IST

ABOUT THE AUTHOR

...view details