ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో సరికొత్త ఛాంపియన్ అవతరించింది. అమెరికాకు చెందిన సోఫియా కెనిన్ శనివారం జరిగిన ఫైనల్స్‌లో గార్బిన్ ముగురుజా(వెనెజువెలా)ను 4-6, 6-2, 6-2 తేడాతో ఓడించి.. కెరీర్లో తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించింది. కెనిన్ 21 ఏళ్ల 80 రోజుల్లో ఈ ఘనత అందుకుంది. ఫలితంగా ఈ ఫీట్ సాధించిన రెండో పిన్నవయస్కూరాలిగా పేరు తెచ్చుకుంది. గతంలో రష్యన్ స్టార్ ప్లేయర్ మారియా షరపోవా 2008లో 20 ఏళ్ల 283 రోజుల్లోనే ట్రోఫీ అందుకొని చరిత్ర సృష్టించింది.
ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళా ఛాంపియన్‌గా సోఫియా - Sofia Kenin
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో యువ సంచలనం సోఫియా కెనిన్(అమెరికా) చరిత్ర సృష్టించింది. మహిళల సింగిల్స్‌లో టైటిల్ గెలిచి ఈ ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్‌ను కైవసం చేసుకుంది. ఇవాళ జరిగిన ఫైనల్లో ముగురుజా(వెనెజువెలా)పై జయకేతనం ఎగురవేసింది.
![ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళా ఛాంపియన్‌గా సోఫియా Australian open 2020](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5924140-650-5924140-1580564347637.jpg)
ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళా ఛాంపియన్‌గా సోఫియా
ఈ రోజు జరిగిన ఫైనల్ పోరులో కెనిన్ తొలి రౌండ్‌లో వెనుకబడింది. తర్వాత పుంజుకొని రెండు, మూడు రౌండ్లలో ఆధిక్యం సాధించి మాజీ ఛాంపియన్ ముగురుజాను మట్టికరిపించింది.
Last Updated : Feb 28, 2020, 7:35 PM IST