తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆస్ట్రేలియా ఓపెన్​లో బోపన్న, పేస్​ ముందంజ - Bopanna in quarters

ఆస్ట్రేలియా ఓపెన్​లో భారత స్టార్​ ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. మిక్స్​డ్​ డబుల్స్​లో బరిలోకి దిగిన రోహన్​ బోపన్న, లియాండర్​ పేస్​ టోర్నీలో మరింత ముందంజ వేశారు. తాజాగా జరిగిన ఆయా మ్యాచ్​ల్లో గెలిచి బోపన్న క్వార్టర్స్​లో అడుగుపెట్టగా, పేస్​ రెండో రౌండ్​కు చేరాడు.

Australian Open 2020:
ఆస్ట్రేలియా ఓపెన్​లో బోపన్న,పేస్​ ముందంజ

By

Published : Jan 26, 2020, 6:28 PM IST

Updated : Feb 25, 2020, 5:13 PM IST

ప్రతిష్టాత్మక ఆస్ట్రేలియా ఓపెన్​లో భారత టెన్నిస్​ ఆటగాళ్లు రోహన్​ బోపన్న, లియాండర్​ పేస్ అదరగొట్టేస్తున్నారు. ఈరోజు జరిగిన మిక్స్​డ్​ డబుల్స్​ రెండో రౌండ్​లో బోపన్న-నదియా కిచెనొక్​(ఉక్రెయిన్​) జోడీ.. నికోలే మెలికార్​-బ్రూనోపై 6-4, 7-6 తేడాతో నెగ్గింది. ఫలితంగా ఈ విజయంతో టోర్నీలో క్వార్టర్​ ఫైనల్​ చేరింది బోపన్న జంట.

పేస్​కు ఆఖరిది...

ఆస్ట్రేలియా ఓపెన్​లో మరో భారత స్టార్​ ప్లేయర్​ లియాండర్​ పేస్​ జోడీ కూడా ముందంజ వేసింది. మిక్స్​డ్​ విభాగంలో పేస్-జెలెనా(లాత్వియా)​ కలిసి బరిలోకి దిగారు. ఆదివారం జరిగిన తొలి రౌండ్​ మ్యాచ్​లో స్టోర్మ్​-మార్క్​ను ఓడించారు. వీరిద్దరూ 2017 ఫ్రెంచ్​ ఓపెన్​ ఛాంపియన్లు కావడం విశేషం. ఈ రెండు జోడీల మధ్య పోరు దాదాపు గంట 27 నిమిషాలు సాగింది. ఈ ఓపెన్​లో చివరిసారి ఆడుతున్నాడు 46 ఏళ్ల లియాండర్​ పేస్​.

Last Updated : Feb 25, 2020, 5:13 PM IST

ABOUT THE AUTHOR

...view details