తెలంగాణ

telangana

By

Published : Jan 29, 2020, 7:04 PM IST

Updated : Feb 28, 2020, 10:29 AM IST

ETV Bharat / sports

ఆస్ట్రేలియా ఓపెన్​: క్వార్టర్స్​​లో నాదల్​కు షాకిచ్చిన థీమ్​

ప్రతిష్టాత్మక గ్రాండ్​స్లామ్​ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్​లో నాదల్​ కథ ముగిసింది. బుధవారం జరిగిన క్వార్టర్స్​ మ్యాచ్​లో డొమినిక్​ థీమ్(ఆస్ట్రేలియా) చేతిలో ఓటమిపాలయ్యాడు ఐదో సీడ్​ రఫేల్​ నాదల్(స్పెయిన్​)​​. ఫలితంగా ఈ మెగాటోర్నీలో సెమీఫైనల్​కు చేరాడు థీమ్​.

Australian Open 2020
ఆస్ట్రేలియా ఓపెన్​: క్వార్టర్స్​​లో నాదల్​కు షాకిచ్చిన థీమ్​

ఆస్ట్రేలియా ఓపెన్​లో ప్రపంచ నెం.1 రఫేల్​ నాదల్​కు షాకిచ్చాడు డొమినిక్​ థీమ్​. బుధవారం జరిగిన క్వార్టర్స్​లో 7-6 (7/3), 7-6 (7/4), 4-6, 7-6 (8/6) తేడాతో నాదల్​ను ఓడించాడు. ఫలితంగా 20వ గ్రాండ్​స్లామ్​ గెలవాలన్న నాదల్​ ఆశలకు చెక్​ పడింది. ఇదే ప్రత్యర్థి చేతిలోనే చివరిగా ఆడిన రెండు ఫ్రెంచ్​ ఓపెన్​ ఫైనల్లోనూ ఓడిపోయాడు రఫా.

పురుషుల సింగిల్స్​ సెమీఫైనల్​-1లో ఫెదరర్‌, రెండో సీడ్‌ నొవాక్‌ జకోవిచ్‌ (సెర్బియా) మధ్య పోరు జరగనుంది. సెమీఫైనల్​-2లో ప్రపంచ నెం.5 థీమ్​, అలెగ్జాండర్​ జ్వెరెవ్​ తలపడనున్నారు.

మహిళల సింగిల్స్​ తొలి సెమీస్​లో టాప్​ సీడ్​ బార్టీ, 14వ సీడ్​ కెనిన్​ పోటీపడనున్నారు. మరో సెమీఫైనల్లో హలెప్​, ముగురుజ అమీతుమీ తేల్చుకుంటారు.

Last Updated : Feb 28, 2020, 10:29 AM IST

ABOUT THE AUTHOR

...view details