ప్రముఖ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో దిగ్గజ ఆటగాడు ఫెదరర్‌కు నిరాశ తప్పలేదు. నేడు మెల్బోర్న్ వేదికగా జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో నొవాక్ జకోవిచ్(సెర్బియా) చేతిలో ఓటమిపాలయ్యాడు. ఈ మ్యాచ్‌లో రోజర్పై 7-6, 6-4, 6-3 తేడాతో వరుస సెట్లలో నెగ్గాడు జకో. ఫలితంగా కెరీర్లో 8వ సారి ఈ ఓపెన్ ఫైనల్ చేరి చరిత్ర సృష్టించాడు. అంతేకాకుండా 17వ గ్రాండ్‌స్లామ్‌ను ఖాతాలో వేసుకొనేందుకు మరో అడుగుదూరంలో నిలిచాడు. ఫెదరర్‌తో 50 సార్లు తలపడిన జకో... తాజాగా 27వ విజయం సాధించాడు. జొకోవిచ్ ఇప్పటివరకు ఏడుసార్లు(2008, 2011, 2012, 2013, 2015, 2016, 2019) ఈ ఓపెన్‌లో ఫైనల్ చేరగా.. ఒక్కసారి ఓడిపోలేదు.
ఆస్ట్రేలియన్ ఓపెన్: ఫెదరర్‌కు నిరాశ.. 8వ సారి ఫైనల్లో జకోవిచ్
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మరో టైటిల్ గెలవాలన్నరోజర్ ఫెదరర్ ఆశలకు చెక్ పెట్టాడు జకోవిచ్. నేడు రోజర్‌తో జరిగిన తొలి సెమీఫైనల్లో వరుస సెట్లలో విజయం సాధించాడు జకో. ఫలితంగా ఈ ఓపెన్‌లో 8వ సారి ఫైనల్ చేరాడీ సెర్బియా స్టార్. అంతేకాకుండా ఈ ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ అందుకోడానికి మరో అడుగుదూరంలో మాత్రమే నిలిచాడు జకోవిచ్.
ఆస్ట్రేలియా ఓపెన్: 8వ సారి ఫైనల్ చేరిన జకోవిచ్
పురుషుల సింగిల్స్ మరో సెమీఫైనల్లో ప్రపంచ నెం.5 థీమ్(ఆస్ట్రేలియా), అలెగ్జాండర్ జ్వెరెవ్(జర్మనీ) తలపడనున్నారు. ఈ మ్యాచ్ శుక్రవారం జరగనుంది.
Last Updated : Feb 28, 2020, 1:17 PM IST