తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌: ఫైనల్​కు థీమ్​.. జకోవిచ్​తో టైటిల్​ పోరు - ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ 2020

ఆస్ట్రేలియన్​ ఓపెన్​ పురుషుల సింగిల్స్​ ఫైనల్​కు చేరి చరిత్ర సృష్టించాడు డొమినిక్​ థీమ్​. తాజాగా జరిగిన సెమీస్​ మ్యాచ్​లో అలెగ్జాండర్​ జ్వెరెవ్​పై గెలుపొందాడు. ఫలితంగా జకోవిచ్​తో టైటిల్​ పోరుకు సిద్ధమవుతున్నాడీ ఆస్ట్రేలియా ప్లేయర్​. ఫైనల్​ మ్యాచ్​ ఆదివారం జరగనుంది.

australia Open 2020
ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌: ఫైనల్​కు థీమ్​.. జకోవిచ్​తో టైటిల్​ పోరు

By

Published : Jan 31, 2020, 6:19 PM IST

Updated : Feb 28, 2020, 4:42 PM IST

ఈ ఏడాది తొలి గ్రాండ్​స్లామ్​ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్​లో యువ సంచలనం డొమినిక్​ థీమ్​.. ఫైనల్​ చేరాడు. ఈ టోర్నీలో టైటిల్​ పోరుకు అర్హత సాధించిన తొలి ఆసీస్​ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు థీమ్​. ఇవాళ జరిగిన సెమీస్​ మ్యాచ్​లో అలెగ్జాండర్​ జ్వెరెవ్​(జర్మనీ)పై గెలుపొందాడు. ఈ మ్యాచ్​లో తొలిసెట్​ను 3-6తో కోల్పోయిన థీమ్​.. తర్వాత తేరుకొని 6-4 7-6(3), 7-6(4) తేడాతో వరుస సెట్లలో విజయం సాధించాడు. ఈ మెగాటోర్నీ ఫైనల్ ఆదివారం(ఫిబ్రవరి 2న) జరగనుంది. ఇందులో 8వ సారి ఫైనల్​ చేరిన నొవాక్​ జకోవిచ్(సెర్బియా)​తో టైటిల్​ పోరులో తలపడనున్నాడు థీమ్​.

Last Updated : Feb 28, 2020, 4:42 PM IST

ABOUT THE AUTHOR

...view details