తెలంగాణ

telangana

ETV Bharat / sports

కెరీర్ బెస్ట్ ర్యాంక్ సాధించిన సుమిత్ నగల్ - సుమిత్ నగల్ ఏటీపీ ర్యాంకింగ్స్

భారత యువ టెన్నిస్ ఆటగాడు సుమిత్ నగల్​ ఏటీపీ ర్యాంకింగ్స్​లో 26 స్థానాలు మెరుగుపర్చుకున్నాడు. ప్రస్తుతం 135వ ర్యాంకులో కొనసాగుతున్నాడు.

సుమిత్

By

Published : Sep 30, 2019, 11:32 AM IST

Updated : Oct 2, 2019, 1:52 PM IST

ఇటీవలే గ్రాండ్​ స్లామ్​ అరంగేట్రం చేసిన భారత యువ టెస్నిస్ ఆటగాడు సుమిత్ నగల్ తాజాగా విడుదల చేసిన ఏటీపీ ర్యాంకింగ్స్​లో సత్తాచాటాడు. ఏకంగా 26 స్థానాలు మెరుగుపర్చుకుని 135 ర్యాంకులో నిలిచాడు.

ఏటీపీ ర్యాంకింగ్స్

ఆదివారం జరిగిన బ్యూనోస్ ఎయిర్స్​ ఛాలెంజర్ ట్రోఫీ పైనల్లో గెలిచి టైటిల్ సాధించాడు సుమిత్. ఫైనల్లో ఫకుండో బొగ్నిస్​పై 6-4, 6-2 తేడాతో సునాయాస విజయం సాధించాడు. ఫలితంగా ఈ టైటిల్ గెలిచిన తొలి ఆసియా ఆటగాడిగా ఘనత సాధించాడు.

ఇటీవల జరిగిన యూఎస్​ ఓపెన్​ తొలిపోరులో టెన్నిస్ దిగ్గజం ఫెదరర్​తో తలపడి వార్తల్లో నిలిచాడు సుమిత్. ఈ మ్యాచ్​లో 6-4, 1-6, 2-6, 4-6 తేడాతో ఓటమిపాలయ్యాడు.

ఇవీ చూడండి.. మిక్స్​డ్ రిలేలో భారత జట్టుకు ఏడో స్థానమే...

Last Updated : Oct 2, 2019, 1:52 PM IST

ABOUT THE AUTHOR

...view details