తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఒకప్పుడు బ్యాట్ పట్టింది... నేడు రాకెట్​తో సత్తా చాటింది - ఫ్రెంచ్​ ఓపెన్​ టైటిల్

ఫ్రెంచ్ ఓపెన్​ మహిళల సింగిల్స్​ టైటిల్​ను ఎగరేసుకుపోయింది ఆసీస్​ యువ క్రీడాకారిణి ఆష్లీ బార్టీ. ఫైనల్లో చెక్​​ రిపబ్లిక్​ ప్లేయర్​ వొంద్రుసోవాపై విజయం సాధించింది. ఆస్ట్రేలియాకు ఫ్రెంచ్​ ఓపెన్​ టైటిల్ అందించిన బార్టీ... ఒకప్పుడు క్రికెట్​ బ్యాట్​తోనూ ఆటాడేసింది.

అప్పట్లో క్రికెటర్​...ఇప్పుడు ఫ్రెంచ్​ ఓపెన్​ ఛాంపియన్​

By

Published : Jun 9, 2019, 8:01 AM IST

Updated : Jun 9, 2019, 8:15 AM IST

ఆసీస్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి... ఎనిమిదో సీడ్‌ ఆష్లీ బార్టీ ఫ్రెంచ్‌ ఓపెన్‌ విజేతగా నిలిచింది. శనివారం వొంద్రుసోవాతో తొలి గ్రాండ్‌స్లామ్​ సింగిల్స్‌ ఫైనల్స్​లో తలపడి గెలిచింది. తన దేశానికి 46 ఏళ్ల తర్వాత ఫ్రెంచ్​ ఓపెన్​ టైటిల్​ను అందించింది. మరి ఇంత ఘనత సాధించిన ఈ స్టార్​ ప్లేయర్​ ఒకప్పడు క్రికెటర్​ కూడా.

బిగ్​బాష్​ లీగ్​లో బార్టీ

బార్టీ మొదట టెన్నిస్‌లో అడుగుపెట్టింది. తర్వాత కొన్ని రోజులు విరామం తీసుకొని 2015లో క్వీన్స్‌లాండ్‌ క్రికెట్‌ బోర్డుని సంప్రదించి క్రికెట్‌లో తొలి అడుగులు వేసింది. ఈ సమయంలోనే ఆమె 'వెస్టర్న్‌ సబర్బ్స్‌ డిస్ట్రిక్ట్స్‌' క్లబ్‌ తరఫున బ్యాట్‌ పట్టి మంచి పేరు తెచ్చుకుంది. అనంతరం మహిళల బిగ్‌బాష్‌ లీగ్‌లో అడుగుపెట్టినా పెద్దగా రాణించలేదు. కొద్ది కాలం క్రికెట్‌ ఆడిన ఈ అమ్మడు... బిగ్‌ బాష్‌ లీగ్‌ అనంతరం మళ్లీ టెన్నిస్‌ రాకెట్‌ పట్టింది.

బార్టీ టెన్నిస్​లోకి వచ్చాక నాలుగు సింగిల్స్‌ టైటిల్స్‌తో పాటు 10 డబుల్స్‌ టైటిల్స్‌ను సొంతం చేసుకుంది. అందులో 2018 యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిట్‌ కూడా ఉంది.

ఇవీ చూడండి:

ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ విజేత ఆష్లే బార్టీ

Last Updated : Jun 9, 2019, 8:15 AM IST

ABOUT THE AUTHOR

...view details