మియామి ఓపెన్ మహిళల సింగిల్స్ విజేతగా ఆస్ట్రేలియా టెన్నిస్ స్టార్ ఆష్లీ బార్టీ నిలిచింది. తుది పోరులో కెనడా క్రీడాకారిణి బియాంకా ఆండ్రెస్కూపై విజయం సాధించింది.
6-3, 4-0 తేడాతో ప్రత్యర్థిని నిలువరించిన బార్టీ.. వరుసగా రెండోసారి మియామి ఓపెన్‌ను కైవసం చేసుకుంది. ఆట మధ్యలో ఆండ్రెస్కూ కుడి పాదానికి గాయమైంది. దీంతో ఆటను మధ్యలోనే వదిలేసింది ఈ కెనడా ప్లేయర్.