మెల్బోర్న్ వేదికగా జరిగిన ఫిలిప్ ఐలాండ్ ట్రోఫీ డబ్ల్యూటీఏ 250 టెన్నిస్ టోర్నీలో భారత టెన్నిస్ స్టార్ అంకిత రైనా విజేతగా నిలిచింది. మహిళల డబుల్స్ విభాగంలో రష్యన్ భాగస్వామి కామిల్లా రఖిమోవాతో కలిసి శుక్రవారం ట్రోఫీని సొంతం చేసుకుంది. అంతర్జాతీయ టెన్నిస్ కెరీర్లో అంకితకు ఇదే తొలి డబ్ల్యూటీఏ టైటిల్ కావడం విశేషం.
తొలి డబ్ల్యూటీఏ టైటిల్ నెగ్గిన అంకిత రైనా - డబ్ల్యూటీఏ 250 టెన్నిస్ టోర్నమెంట్
భారత టెన్నిస్ స్టార్ అంకిత రైనా.. తన కెరీర్లో తొలి డబ్ల్యూటీఏ టైటిల్ను ఖాతాలో వేసుకుంది. మెల్బోర్న్ వేదికగా శుక్రవారం జరిగిన ఫిలిప్ ఐలాండ్ ట్రోఫీ మహిళల డబుల్స్ విభాగంలో కామిల్లా రఖిమోవాతో కలిసి రష్యన్ జోడీపై విజయాన్ని నమోదు చేసింది.
తొలి డబ్ల్యూటీఏ టైటిల్ నెగ్గిన అంకిత రైనా
టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగిన డబ్ల్యూటీఏ టూర్లో అన్న బ్లింకోవా, అనస్తాసియా పొటాపోవాపై 2-6, 6-4, 10-7 తేడాతో అంకిత ద్వయం గెలుపొందింది. దీంతో మహిళల టెన్నిస్ అసోసియేషన్ ర్యాంకింగ్స్లో టాప్100లోకి చేరిన అంకిత.. ప్రస్తుతం 94వ స్థానంలో ఉంది.
ఇదీ చూడండి:ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్కు బ్రాడీ, ఒసాకా