ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో డబుల్స్‌లో తొలి రౌండ్లోనే ఓడిన భారత యువ కెరటం అంకిత రైనా.. ఫిలిప్ ఐలాండ్ టెన్నిస్ ట్రోఫీలో శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఆమె 5-7, 6-1, 6-2తో కొకారెటో (ఇటలీ)పై విజయం సాధించింది. రెండు గంటలకు పైగా సాగిన ఈ పోరులో తొలి సెట్లో ఓడినా.. రెండు, మూడు సెట్లలో పుంజుకుని ఆమె విజయాన్ని అందుకుంది.
ఫిలిప్ ఐలాండ్ ట్రోఫీలో అంకిత శుభారంభం - Ankita Raina, a young Indian tennis player
భారత టెన్నిస్ యువ ప్లేయర్ అంకిత రైనా ఫిలిప్ ఐలాండ్ ట్రోఫీలో శుభారంభం చేసింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఇటలీ ప్లేయర్ కొకారెటోపై విజయం సాధించింది. 5-7, 6-1, 6-2 తేడాతో ప్రత్యర్థిని ఓడించింది.
ఫిలిప్ ఐలాండ్ ట్రోఫీలో అంకిత శుభారంభం
డబ్ల్యూటీఏ టూర్ ఈవెంట్లో సింగిల్స్ మెయిన్ డ్రాలో అంకితకు ఇదే తొలి విజయం. ఈ గెలుపుతో ఆమె 181 ర్యాంకు నుంచి 156వ ర్యాంకుకు చేరనుంది. ఒకవేళ ఈ టోర్నీలో మరింత ముందుకెళ్తే అంకిత టాప్-150లో చోటు సంపాదించే అవకాశం ఉంది. డబ్ల్యూటీఏ థాయ్‌లాండ్ ఓపెన్‌లో మెయిన్‌డ్రాలో ఆడిన అంకిత.. అక్కడ తొలి రౌండ్లోనే ఓడింది.