ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి మాజీ ప్రపంచ నంబర్ వన్ ఆండీ ముర్రే తప్పుకున్నాడు. టోర్నీలో పాల్గొనే ముందు తనకు క్వారంటైన్లో ఉండటం ఇష్టంలేదని చెప్పాడు. అందుకే టోర్నీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు.
ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి తప్పుకున్న ముర్రే - ఆస్రేలియన్ ఓపెన్ నుంచి తప్పుకున్న ఆండ్రీ ముర్రె
క్వారంటైన్లో ఉండటం ఇష్టం లేక ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు బ్రిటన్ టెన్నిస్ ఆటగాడు ఆండీ ముర్రే. ఇటీవల అతడికి కరోనా పాజిటివ్‌గా తేలడం వల్ల అప్పటినుంచి అతడు ఐసోలేషన్‌లో ఉంటున్నాడు.
టోర్నీ ప్రారంభానికి ముందు చేసిన వైద్య పరీక్షల్లో జనవరి 14న ఆండీ ముర్రేకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో అతడు ఆస్ట్రేలియా వెళ్లకుండా అప్పటినుంచి లండన్‌లోని తన ఇంట్లో ఐసోలేషన్‌లో ఉన్నాడు. ఇంకా తగ్గిందా లేదా అనేది స్పష్టత లేదు. ఒకవేళ అతడు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొనాలని భావిస్తే ఆతిథ్య దేశంలో మరోసారి క్వారంటైన్లో ఉండాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే అతడు ఆ నిబంధనలను పాటించలేక టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపాడు.
ఇదీ చూడండి : టెన్నిస్ దిగ్గజం ఫెదరర్ ఖాతాలో మరో రికార్డు