తెలంగాణ

telangana

ETV Bharat / sports

మరోసారి జోడిగా ఆడుతున్న ముర్రే బ్రదర్స్ - Jamie Murray

సోదరుడు జెమీతో కలిసి మరోసారి డబుల్స్​ ఆడనున్నాడు ఆండీ ముర్రే. త్వరలో జరిగే వాషింగ్టన్​ ఓపెన్​లో ఇద్దరూ కలిసి బరిలో దిగనున్నారు.

ఆండీ ముర్రే, జెమీ ముర్రే

By

Published : Jul 25, 2019, 6:15 PM IST

ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు ఆండీ ముర్రే... త్వరలో జరిగే వాషింగ్టన్ ఓపెన్​లో సోదరుడు జెమీ ముర్రేతో కలిసి డబుల్స్ ఆడనున్నాడు. వీరిద్దరూ ఇంతకుముందే 2015 డేవిస్​ కప్​లో విజేతలుగా నిలిచారు.

ఆండీ ముర్రేకు ఈ ఏడాది జనవరిలో నడుము భాగంలో శస్త్రచికిత్స జరిగింది. జూన్​లో కోర్టులోకి అడుగుపెట్టాడు. ఆ వెంటనే ఫెలిసియానో లోపెజ్​తో కలిసి క్వీన్స్ డబుల్స్ టైటిల్​ గెల్చుకున్నాడు.

32 ఏళ్ల ఆండీ ముర్రే.. సింగిల్స్ విభాగంలో మూడు సార్లు గ్రాండ్​స్లామ్ విజేతగా నిలిచాడు. కానీ ఇటీవల జరిగిన టోర్నీల్లో అతడి ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది.

సోదరునితో కలిసి డబుల్స్​ ఆడటంపై స్పందించాడు ఆండీ సోదరుడు జెమీ.

ఆండీ ముర్రే, జెమీ ముర్రే

"డబుల్స్​ ఈవెంట్​పై పూర్తి దృష్టి సారించాం. ఆండీ పునరాగమనంతో ఈ ఈవెంట్​ కోసం​ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు." -జెమీ ముర్రే, ఆండీ సోదరుడు

వాషింగ్టన్​ ఓపెన్​.. జూలై 27 నుంచి ఆగస్టు 4 వరకు జరగనుంది.

ఇది సంగతి: జపాన్​ ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో సింధు

ABOUT THE AUTHOR

...view details