తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఫెదరర్​ రికార్డును జకోవిచ్​  అధిగమించగలడా? - ఫెదరర్​ గ్రాండ్​స్లామ్స్

నొవాక్ జకోవిచ్​.. తన కెరీర్​లో ఇప్పటివరకు 18 గ్రాండ్​స్లామ్​ టైటిల్స్​ సొంతం చేసుకున్నాడు. గత పది గ్రాండ్​స్లామ్​ టోర్నీల్లో ఆరు విజయాలు జకోవిచ్​వే కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఫెదరర్​ పేరిట ఉన్న అత్యధిక గ్రాండ్​స్లామ్​ టైటిళ్ల(20) రికార్డును జకో అధిగమిస్తాడని తెలుస్తోంది.

Analysis: Djokovic right to focus on Federer, Nadal, Slams
ఫెదరర్​ రికార్డును జకోవిచ్​ రికార్డు సాధించగలడా?

By

Published : Feb 22, 2021, 11:30 AM IST

గత పది గ్రాండ్​స్లామ్ టోర్నీల్లో ఆరింట్లో జకోవిచ్​దే గెలుపు! ఈ ఒక్క గణాంకం చాలు అతడి దూకుడు ఎలా ఉందో చెప్పేందుకు. ఇన్నాళ్లూ ఫెదరర్ (20 టైటిళ్లు) రికార్డును నాదల్ తిరగరాస్తాడా? అనే అభిమానులు ఆలోచించి ఉంటారు. కానీ, 38 ఏళ్ల జకో (18 టైటిళ్లు) జోరు చూస్తే వీళ్లిద్దరినీ దాటేస్తాడా అన్నట్లుంది.. ఎందుకంటే 40 ఏళ్లకు చేరువగా వచ్చిన పెదరర్, బరిలో దిగి చాలా నెలలు అయింది. అతను గ్రాండ్ స్లామ్ గెలిచి మూడేళ్లయింది. 34 ఏళ్ల రఫా కూడా ఫ్రెంచ్ ఓవెన్లో తప్ప పెద్దగా రాణించలేకపోతున్నాడు. కానీ, అన్ని కోర్టుల్లోనూ స్థిరంగా ఆడుతూ దూసుకెళ్తున్నాడు జకో.

ముఖ్యంగా హార్డ్ కోర్టు. గ్రాస్ కోడ్టుల్లో చెలరేగి ఆడుతున్నాడు. ఒక్క మట్టి మైదా నాల్లో మాత్రమే రఫెల్ నాదల్ డొమినిక్ డీమ్ లాంటి వాళ్ల నుంచి నొవాక్ ప్రతిఘటన ఎదురవుతోంది. అందులోనూ కొత్త తరం ఆటగాళ్లెవరూ అతని స్థాయిలో ఉండకపోవడం కూడా జకోకు కలిసొస్తోంది. జ్వెరెవ్ డీమ్, మెద్వెదేవ్, సిట్సిపాస్ లాంటి కుర్రాళ్లు గట్టిపోటీనే ఇస్తున్నా అనుభవం, ఒత్తిడిని జయించే లక్షణంతో జకో వారిపై పైచేయి సాధిస్తున్నాడు.

పోరాటమే పరామావధిగా..

ఆస్ట్రేలియన్ ఓపెన్లో ఆటే ఇందుకు నిదర్శనం. రెండో రౌండ్లోనే వెన్నునొప్పి బాధపెట్టినా.. టోర్నీకి దూరం అవుతాడేమో అన్న సందేహాలు కలిగినా నొవాక్ మాత్రం పట్టుదల వదల్లేదు. ఎంత ఒత్తిడి ఉంటే అంత మెరుగ్గా ఆడాడు. రెండో రౌండ్ నుంచి క్వార్టర్‌ ఫైనల్ వరకు అతనికి విజయాలేవీ సులభంగా దక్కలేదు. అయిదుసార్లు ప్రత్యర్థులకు సెట్ కోల్పోయాడు. కానీ, అతను పుంజువన్న తీరు మాత్రం అద్భుతం. ప్రిట్జ్​తో పోరులో వెన్నునొప్పి ఇబ్బంది పెడుతున్నా.. అయిదు సెట్లు ఆడి మరీ గెలిచాడు. ఆ పట్టుదల, పోరాటమే జోకు టైటిల్​ను అందించింది. జోరు మున్ముందు కొనసాగితే అతను అత్యధిక టైటిళ్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

అదే జకోకు ప్రధాన శత్రువు..

ఎందుకంటే రఫా ఆధిపత్యం సాగే ఫ్రెంచ్ ఓపెన్​ను పక్కనపెడితే యూఎస్ ఓపెన్, వింబుల్డన్​లో నొవాక్​కు మంచి అవకాశాలున్నాయి. అయితే మెరుగ్గానే ఆడినా అతను ఇప్పటిదాకా మూడుసార్లు మాత్రమే యూఎస్ ఓపెన్ సెగ్గ గలిగాడు. అప్పట్లో ఫెదరర్, నాదల్ అతనికి అడ్డుపడ్డారు. ఈ నేపథ్యంలో అయిదుసార్లు నెగ్గిన వింబుల్డన్​తో పాటు యూఎస్ ఓపెన్​నూ తన అడ్డా చేసుకోగలిగితే నొవాక్ ఆల్​టైమ్ గ్రేట్ గా మిగిలే అవకాశాలున్నాయని పండితుల మాట. ప్రస్తుత ఫామ్​ను పరిగణనలోకి తీసుకుంటే జూన్​లో జరిగే వింబుల్డన్, ఈ ఏడాది చివర్లో నిర్వహించే యూఎస్ ఓవెన్​లో జకో విజేతగా నిలిచే అవకా శాలను కొట్టిపారేయలేం. అయితే అతనికి ప్రధాన శత్రువు చాలా ఏళ్లుగా ఇబ్బంది పెడుతున్న వెన్ను సమస్యే. ముఖ్యంగా అయిదు నెట్ల పోరాటాల్లో ఫిట్‌నెస్ పరంగా నొవాక్ కష్టపడుతున్నాడు. ఈ ఇబ్బందిని అధిగమించి అతను ఎలా ముందుకెళ్తాడనేది ఆసక్తికరం.

ఇదీ చూడండి:తొమ్మిదో సారి ఆస్ట్రేలియన్​ ఓపెన్ ఛాంపియన్​గా జకోవిచ్​

ABOUT THE AUTHOR

...view details