తెలంగాణ

telangana

డేవిస్​ కప్:​ వేదిక మార్పా..? లేక వాయిదానా..?

By

Published : Aug 14, 2019, 2:00 PM IST

Updated : Sep 26, 2019, 11:45 PM IST

పాకిస్థాన్​లోని ఇస్లామాబాద్​ వేదికగా జరగాల్సిన డేవిస్​ కప్​పై భారత టెన్నిస్​ సంఘం మరోసారి అంతర్జాతీయ టెన్నిస్​ ఫెడరేషన్​కు లేఖ రాసింది. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయని పేర్కొంటూ... వేదిక మార్పుపై పునఃసమీక్షించాలని కోరింది. సాధ్యం కాకపోతే మ్యాచ్​లను కొన్ని రోజులు వాయిదా వేయాలని విజ్ఞప్తి చేసింది.

డెవిస్​ కప్:​ వేదిక మార్చాలి.. లేదంటే వాయిదా వేయాలి

పాకిస్థాన్​లో వచ్చే నెల 14, 15 తేదీల్లో జరగనున్న డేవిస్​ కప్ మ్యాచ్​లపై భారత టెన్నిస్​ సంఘం(ఏఐటీఎఫ్​)... మరోసారి అంతర్జాతీయ టెన్నిస్​ ఫెడరేషన్(ఐటీఎఫ్​)​కు లేఖ రాసింది. ప్రస్తుతం భారత్-పాక్​ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని అందులో పేర్కొంది. వేదిక మార్చాలని... లేదంటే పరిస్థితి చక్కబడేవరకు మ్యాచ్​లను వాయిదా వేయాలని కోరింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆటల్లో పాల్గొనే అవకాశం లేదని స్పష్టంచేసింది భారత టెన్నిస్​ సంఘం.

గతంలో భారత టెన్నిస్​ సంఘం వేదిక మార్చాలని కోరగా.. ఆ అభ్యర్థనను తిరస్కరించింది ఐటీఎఫ్​. ఇటీవల భారత ఆటగాళ్లు తమ భద్రతపై భయాందోళనలు వ్యక్తం చేశారు.

ఇప్పటికే ఈ టోర్నీ కోసం మహేశ్​ భూపతి సారథ్యంలో ఆరుగురు ఆటగాళ్ల జట్టును ప్రకటించింది భారత టెన్నిస్​ సంఘం.

ఇవీ చూడండి...డేవిస్ కప్: భారత బృందం పర్యటనపై అదే ప్రతిష్టంభన

Last Updated : Sep 26, 2019, 11:45 PM IST

ABOUT THE AUTHOR

...view details