తెలంగాణ

telangana

ETV Bharat / sports

జ్వెరెవ్​​ వల్లే గర్భవతి అయ్యా: బ్రెండా

జర్మనీ టెన్నిస్ ఆటగాడు అలెగ్జాండర్​ జ్వెరెవ్​ తండ్రి కాబోతున్నాడని తన మాజీ ప్రేయసి వెల్లడించింది. దీనిపై జ్వెరెవ్​ ఎలాంటి స్పందన ఇవ్వలేదు.

Zveren_allegations
జ్వెరెన్​ వల్లే గర్భవతి అయ్యా: బ్రెండా

By

Published : Oct 29, 2020, 8:01 AM IST

23 ఏళ్ల వయసులోనే జర్మనీ టెన్నిస్‌ ఆటగాడు అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ తండ్రి కాబోతున్నాడా?.. అతని మాజీ ప్రేయసి బ్రెండా వ్యాఖ్యల ప్రకారం అది నిజమేనని తెలుస్తోంది. తాను గర్భంతో ఉన్నానని, దానికి కారణం జ్వెరెవ్‌ అని.. ఈ ఏడాది ఆగస్టులో అతని నుంచి విడిపోయిన 27 ఏళ్ల బ్రెండా వెల్లడించింది. ఈ జోడీ ఓ ఏడాది పాటు సహజీవనం చేసింది.

"నేనిప్పుడు 20 వారాల గర్భవతిని. జ్వెరెవ్‌ కారణంగానే బిడ్డకు జన్మనివ్వబోతున్నా. జీవితంపై మాకు విభిన్న ఆలోచనలు ఉండడంతో కలిసి ఉండలేక విడిపోయాం. పుట్టబోయే బిడ్డను అతని దగ్గర ఉంచను. సొంతంగా బిడ్డ బాధ్యతను చూసుకునే స్థాయిలో ఉండడం నా అదృష్టం" అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది బ్రెండా.

ఈ ఏడాది యుఎస్‌ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన జ్వెరెవ్‌.. బ్రెండా వ్యాఖ్యలపై ఇంకా స్పందించలేదు.

ఇదీ చదవండి:'సూర్య' ప్రతాపం.. ప్లేఆఫ్స్​కు చేరిన ముంబయి

ABOUT THE AUTHOR

...view details