ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో నవోమి ఒసాకా, జెన్నిఫర్ బ్రాడీ మధ్య శనివారం టైటిల్ పోరు జరగనుంది. ఫైనల్లో అందరి ఫేవరెట్ ఒసాకానే. సెమీఫైనల్లో దిగ్గజ క్రీడాకారిణి సెరెనాను ఓడించిన ఆమె రెండోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను గెలవాలని పట్టుదలగా ఉంది.
ఒసాకా Vs బ్రాడీ: సంచలనమా.. లాంఛనమా? - జెన్నిఫర్ బ్రాడీ వార్తలు
ఇప్పటికే మూడు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలిచిన అనుభవం ఒకరిది.. అసాధారణ ఆటతో ఫైనల్ చేరి టైటిల్ దిశగా దూసుకెళ్తున్న ఉత్సాహం మరొకరిది. మరి టైటిల్ ఎవరికి దక్కుతుంది. ఈసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఛాంపియన్ నవోమి ఒసాకా (జపాన్)నా.. కొత్త కెరటం జెన్నిఫర్ బ్రాడీ (అమెరికా)నా..? మరికొద్ది గంటల్లోనే ఈ ప్రశ్నలకు తెరపడనుంది.

ఒసాకా Vs బ్రాడీ: సంచలనమా.. లాంఛనమా?
అయితే 22వ సీడ్ బ్రాడీ నుంచి గట్టి పోటీ తప్పకపోవచ్చు. గతేడాది యుఎస్ ఓపెన్ సెమీస్‌లో ఒసాకాకు ఆమె గట్టిపోటీ ఇచ్చింది. మూడు సెట్ల పాటు పోరాడి ఓడింది. ఈసారి ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది.
- 23 ఏళ్ల ఒసాకా గ్రాండ్‌స్లామ్ ఫైనల్ చేరిన మూడుసార్లు విజయం సాధించింది. వరుసగా 20 మ్యాచ్‌లు గెలిచి మంచి ఫామ్‌లో ఉంది.
- 25 ఏళ్ల జెన్నిఫర్‌కు ఇదే తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్.
Last Updated : Feb 20, 2021, 9:04 AM IST