వింబుల్డన్ (Wimbledon) చరిత్రలో తొలిసారి ఓ మహిళా(మరిజా సిసాక్) .. పురుషుల సింగిల్స్‌లో ఛైర్ అంపైర్‌గా ఉండనుంది. ఆదివారం జరగనున్న ఫైనల్లో ఆమె ఈ బాధ్యతలు నిర్వర్తించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ తుదిపోరు జకోవిచ్, బెరిటిని మధ్య జరగనుంది.
Wimbledon: వింబుల్డన్‌లో ఆ మహిళా అంపైర్ రికార్డు - female chair umpire
వింబుల్డన్(Wimbledon) చరిత్రలో తొలిసారిగా పురుషుల సింగిల్స్ ఫైనల్స్‌లో ఓ మహిళా.. ఛైర్ అంపైర్‌గా వ్యవహరించనుంది. ఆదివారం జకోవిచ్, బెరిటిని మధ్య జరగనున్న తుదిపోరుకు రిఫరీగా ఈమె ఎంపికైంది.
![Wimbledon: వింబుల్డన్‌లో ఆ మహిళా అంపైర్ రికార్డు djokovic](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12418496-758-12418496-1625925354452.jpg)
జకోవిచ్
మరిజా సిసాక్(క్రోషియా).. 2012 నుంచి డబ్ల్యూటీఏ ఎలైట్ టీమ్‌లో సభ్యురాలిగా ఉంటున్నారు. ఆమె గోల్డ్ బ్యాడ్జ్ ఛైర్ అంపైర్. 2014 వింబుల్డన్ మహిళల సింగిల్స్‌లో, అనంతరం గత మూడేళ్లుగా మహిళల డబుల్స్ ఫైనల్లో ఛైర్ అంపైర్‌గా వ్యవహరిస్తున్నారు. 2016 రియో డి జనిరో ఒలింపిక్స్‌లో మహిళల సింగిల్స్ గోల్డ్ మ్యాచ్‌ను కూడా ఛైర్ అంపైర్‌గా ఉన్నారు.
ఇదీ చూడండి: Wimbledon 2021: ఆ రికార్డుకు అడుగు దూరంలో జకో
Last Updated : Jul 10, 2021, 8:23 PM IST