తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీమ్ఇండియా సెమీస్ అవకాశాలు చేజారినట్లేనా? - భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ హైలైట్స్

టీ20 ప్రపంచకప్​(team india t20 world cup)లో భారత జట్టు ప్రదర్శన నిరాశాజనకంగా సాగుతోంది. ఆడిన రెండు మ్యాచ్​ల్లోను ఓడి సెమీస్ అవకాశాల్ని దాదాపు చేజార్చుకుంది. అయితే సెమీస్ చేరాలంటే ఓ అవకాశం మాత్రం ఉంది. అదెలాగో చూద్దాం.

Team India
టీమ్ఇండియా

By

Published : Nov 1, 2021, 8:43 AM IST

'టీ20 ప్రపంచకప్​ 2021లో టీమ్ఇండియా(team india t20 world cup) ఫేవరెట్ జట్టు'.. టోర్నీ ఆరంభానికి ముందు ప్రతి ఒక్కరి మనసులో మాట. 'ఈసారి ట్రోఫీ మనదే!' రెండు వార్మప్ మ్యాచ్​లు గెలవగానే మాజీలు, అభిమానులు అన్న మాటలివి. 'ఒక్క మ్యాచ్ ఓడినంత మాత్రాన ఏం కాదు. భారత్ బలంగా పుంజుకోగలదు'.. తొలి మ్యాచ్​లో పాక్​పై ఓడిన తర్వాత వచ్చిన కామెంట్లివి.. అయితే కొద్దిరోజుల సమయంలోనే అంతా మారిపోయింది. రెండేళ్లుగా ఎంతో పట్టుదల, కసితో కనిపిస్తోన్న కోహ్లీసేన మెగాటోర్నీలో మాత్రం చేతులెత్తేస్తోంది. మొదటి మ్యాచ్​లో పాకిస్థాన్​ చేతిలో చిత్తయిన భారత్.. రెండో మ్యాచ్​లో న్యూజిలాండ్​(ind vs nz t20)పై ఘోరంగా ఓడిపోయింది. దీంతో ఈ టోర్నీలో సెమీస్ చేరే అవకాశాన్ని దాదాపు చేజార్చుకుంది.

టోర్నీలో సాంకేతికంగా మిగిలే ఉన్నా.. వాస్తవికంగా టీమ్‌ఇండియా(team india t20 world cup) కథ ముగిసినట్లే. కోట్ల మందిని నిరాశపరిచిన కోహ్లీసేన ఇక చేయగలిగేదేమీ లేదు.. మిగతా మ్యాచ్‌ల్లో విజయాలతో ఊరడించడం, అద్భుతాల కోసం ఎదురుచూడడం తప్ప!

ఏం జరగాలి?

ప్రపంచకప్ ఫేవరెట్ అనుకున్న టీమ్ఇండియా(team india t20 world cup) తొలి మ్యాచ్​లోనే పాక్(ind vs pak t20) చేతిలో ఓడిపోయింది. కివీస్​తో మ్యాచ్​లో అయినా గెలిచి సెమీస్ రేసులో ఉంటుందనుకుంటే అక్కడా నిరాశే ఎదురైంది. ఇక మన జట్టు అఫ్గానిస్థాన్, స్కాట్లాండ్, నమీబియాతో మ్యాచ్​లు ఆడాల్సి ఉంది. ఈ మూడింటిలో బారత్ గెలిచే అవకాశం ఉంది. ఇప్పటికే ఆడిన మూడు మ్యాచ్​ల్లో విజయాలతో పాక్ సెమీస్ చేరినట్లే. ఇక మనలాగే మూడు చిన్న జట్లతో మ్యాచ్​లు ఆడాల్సిన కివీస్.. వాటిల్లో గెలిస్తే నాకౌట్​కు వెళుతుంది. అఫ్గాన్ ప్రమాదకరమైన జట్టు కాబట్టి.. ఒకవేళ అఫ్గాన్ చేతిలో న్యూజిలాండ్ ఓడితే అప్పుడు మనకు అవకాశం ఉంటుంది. అలా జరగాలంటే న్యూజిలాండ్​ను అఫ్గానిస్థాన్ తక్కువ తేడాతో​ ఓడించాలి. అలాగే అఫ్గానిస్థాన్​పై భారత్ భారీ తేడాతో గెలవాలి. దీంతో మెరుగైన రన్​రేట్​ కారణంగా కోహ్లీసేన సెమీస్ చేరుతుంది.

ఇవీ చూడండి: ఇది మన జట్టేనా?.. ఆ కసి, పట్టుదల ఏమయ్యాయో?

ABOUT THE AUTHOR

...view details