టీ20 ప్రపంచకప్‌లో (T20 world cup 2021) 'నాకౌట్' లాంటి మ్యాచ్‌లో కోహ్లీసేన ఆదివారం న్యూజిలాండ్‌తో (IND Vs NZ) తలపడనుంది. పాకిస్థాన్ చేతిలో ఓటమితో సెమీస్ అవకాశాలు క్లిష్టంగా మారిన నేపథ్యంలో స్టార్లతో కూడిన భారత బ్యాటింగ్ లైనప్‌కు, బౌలింగ్ దళానికి ఇది కఠిన పరీక్షే. బలంగా కనిపిస్తున్న కివీస్‌పై పైచేయి సాధించాలంటే టీమ్‌ఇండియా గొప్ప ప్రదర్శన చేయాల్సిందే. దీంతో పాటు ఐసీసీ ఈవెంట్లలో 18 ఏళ్లుగా భారత్‌పై ఆధిపత్యం చూపిస్తోన్న కివీస్ రికార్డును తుడిచిపెట్టాల్సి ఉంది.
టీమ్‌ఇండియా 2003 వన్డే ప్రపంచకప్‌లో (2003 World Cup Ind Vs Nz) చివరిసారి గంగూలీ నేతృత్వంలో కివీస్‌ను ఓడించగా.. ఆ తర్వాత జరిగిన అన్ని ఐసీసీ టోర్నీల్లోనూ (IND Vs NZ in ICC Events) న్యూజిలాండ్‌దే పైచేయి. మెగా టోర్నీల్లో భారత్ అన్ని ప్రధాన జట్లను మట్టికరిపించినా కివీస్‌ను మాత్రం ఓడించలేకపోయింది. ఇటీవల జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లోనూ కోహ్లీసేన కివీస్ చేతిలోనే ఓడిపోయింది. ఈ నేపథ్యంలో గత 20 ఏళ్లుగా టీమ్‌ఇండియాపై న్యూజిలాండ్ ఆధిపత్యం ఎలా సాగిందో క్లుప్తంగా గుర్తు చేసుకుందాం..
దాదా శతకం వృథా..
2000 ఏడాది ఐసీసీ నాకౌట్ సిరీస్‌లో టీమ్‌ఇండియాకు న్యూజిలాండ్ తొలిసారి షాకిచ్చింది. సౌరభ్ గంగూలీ నేతృత్వంలోని జట్టును స్టీఫెన్ ఫ్లెమింగ్ టీమ్ ఫైనల్లో నాలుగు వికెట్ల తేడాతో ఓడించింది. తొలుత ఓపెనర్లుగా బరిలోకి దిగిన గంగూలీ (117; 130 బంతుల్లో 9x4, 4x6), సచిన్ (69; 83 బంతుల్లో 10x4, 1x6) కివీస్ బౌలర్లపై సంపూర్ణ ఆధిపత్యం చలాయించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 141 పరుగులు జోడించి శుభారంభం చేశారు. తర్వాత సచిన్ ఔటయ్యాక రాహుల్ ద్రవిడ్ (22), యువరాజ్ సింగ్ (18), వినోద్ కాంబ్లీ (1), రాబిన్‌సింగ్ (13), అజిత్ అగార్కర్ (15) పూర్తిగా విఫలమయ్యారు. దీంతో టీమ్‌ఇండియా చివరికి 50 ఓవర్లలో 264/6 స్కోర్ చేసింది. ఛేదనలో కివీస్ 49.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. క్రిస్‌కేర్న్స్ (102*; 113 బంతుల్లో 8x4, 2x6) శతకంతో మెరవగా క్రిస్ హారిస్ (46; 72 బంతుల్లో 4x4) సహకరించాడు. దీంతో న్యూజిలాండ్ రెండు బంతులు మిగిలివుండగానే విజయం సాధించింది.
కైఫ్, ద్రవిడ్ గెలిపించారు..
ఆపై 2003 వన్డే ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా ఫేవరెట్ జట్లలో ఒకటిగా అడుగుపెట్టింది. ఈ క్రమంలోనే సూపర్ సిక్స్ స్టేజ్‌లో న్యూజిలాండ్‌తో (2003 World Cup Ind Vs Nz) తలపడి విజయం సాధించింది. స్టీఫెన్ ఫ్లెమింగ్ నేతృత్వంలోని కివీస్‌ను భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే కట్టడి చేసింది. జహీర్‌ఖాన్ 4/42 విజృంభించడంతో పాటు మిగతా బౌలర్లు తలా ఓ చేయి వేయడంతో న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ పరుగులు చేసేందుకు తంటాలు పడ్డారు. ఫ్లెమింగ్ (30) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అయితే, స్వల్ప లక్ష్య ఛేదనలో టీమ్‌ఇండియా తడబడింది. టాప్‌ఆర్డర్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ (1), సచిన్ తెందూల్కర్ (15), కెప్టెన్ సౌరభ్ గంగూలీ (3) పూర్తిగా విఫలమయ్యారు. 21 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ఇబ్బందికర పరిస్థితుల్లో నిలిచిన జట్టును మహ్మద్ కైఫ్ (68; 129 బంతుల్లో 8x4), రాహుల్ ద్రవిడ్ (53; 89 బంతుల్లో 7x4) ఆదుకున్నారు. వీరిద్దరూ మరో వికెట్ పడకుండా చివరివరకూ క్రీజులో నిలబడి అర్ధశతకాలతో రాణించారు. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా 10 ఓవర్లు మిగిలి ఉండగానే విజయం సాధించింది.
వీరూ, గౌతీ రాణించినా స్వల్ప తేడాతో ఓటమి..
అనంతరం 2007 టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా తొలి విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే, గ్రూప్ స్టేజ్‌లో ధోనీ సారథ్యంలోని టీమ్‌ఇండియా (2007 T20 World Cup Ind Vs Nz) డేనియల్ వెటోరీ నేతృత్వంలోని న్యూజిలాండ్ చేతిలో 10 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. తొలుత ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 190 పరుగుల భారీ స్కోర్ చేసింది. బ్రెండన్ మెక్‌కలమ్ (45; 31 బంతుల్లో 9x4), క్రేగ్ మెక్‌మిలన్ (44; 23 బంతుల్లో 1x4, 4x6), జాకబ్ ఓరమ్ (35; 15 బంతుల్లో 2x4, 3x6) దంచికొట్టారు. ఆపై లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్లు గౌతమ్ గంభీర్ (51; 33 బంతుల్లో 5x4, 2x6), వీరేంద్ర సెహ్వాగ్ (40; 17 బంతుల్లో 6x4, 2x4) రెచ్చిపోయారు. తొలి వికెట్‌కు 76 పరుగులు జోడించి బలమైన పునాది వేశారు. అయితే, మిగతా బ్యాట్స్‌మెన్ ధోనీ (24), యువరాజ్ (5), దినేశ్ కార్తీక్ (17) విఫలమవడంతో జట్టు ఓటమిపాలైంది. చివర్లో శ్రీశాంత్ (19*; 10 బంతుల్లో 4x4) బౌండరీలతో చెలరేగినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
లక్ష్యం 127 కానీ..79కే ఆలౌట్..