వెస్టిండీస్ ఆల్రౌండర్ డ్వేన్ బ్రావో(Bravo Retirement) అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్ టోర్నీ(T20 World Cup) అనంతరం రిటైర్ అవనున్నట్లు ప్రకటించాడు. గురువారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో విండీస్ ఓటమి అనంతరం ఈ ప్రకటన చేశాడు.
"వీడ్కోలుకు సమయం వచ్చేసింది. 18 ఏళ్లుగా వెస్టిండీస్ జట్టులో ఆడుతున్నా. ఈ ప్రయాణంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నా. కానీ, కరీబియన్ జట్టులో ఆడటం ఎల్లప్పుడూ అదృష్టంగానే భావిస్తా."
-డ్వేన్ బ్రావో, వెస్టిండీస్ ఆల్రౌండర్.
మూడు ఐసీసీ ట్రోఫీలు నెగ్గి అంతర్జాతీయ స్థాయిలో వెస్టిండీస్ పేరు నిలబెట్టుకున్నామని బ్రావో అన్నాడు. రెండు ట్రోఫీలు డారెన్ సామి కెప్టెన్సీలోనే పొందినట్లు గుర్తుచేసుకున్నాడు. గురువారం లంకతో మ్యాచ్ అనంతరం ఫేస్బుక్ లైవ్లో ఈ వ్యాఖ్యలు చేశాడు బ్రావో.