తెలంగాణ

telangana

ETV Bharat / sports

స్కాట్లాండ్ కీపర్ మాటలకు భారత అభిమానులు ఫిదా - వికెట్ కీపర్ మాట్ క్రాస్

టీ20 ప్రపంచకప్​లో(T20 World Cup 2021) న్యూజిలాండ్- స్కాట్లాండ్​ మ్యాచ్​లో(NZ vs SCO T20) ఆసక్తికర దృశ్యం కనిపించింది. టీమ్​ఇండియాను ఉద్దేశిస్తూ స్కాట్లాండ్​ కీపర్ చేసిన వ్యాఖ్యలు వైరల్​గా మారాయి.

matt cross
మాట్ క్రాస్

By

Published : Nov 3, 2021, 6:09 PM IST

టీ20 ప్రపంచకప్​లో(T20 World Cup) భాగంగా న్యూజిలాండ్​, స్కాట్లాండ్ మధ్య మ్యాచ్​ నేపథ్యంలో ఓ అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది. ఒక్క మాటతో స్కాట్లాండ్ వికెట్ కీపర్ మాట్ క్రాస్(matt cross news)​ భారతీయ క్రికెట్ అభిమానుల మనసు గెలుచుకున్నాడు. క్రిస్​ గ్రీవ్స్​ బౌలింగ్​ చేస్తున్న సమయంలో మాట్​ చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం.

న్యూజిలాండ్​తో మ్యాచ్​లో భారత్​ ఓటమి(IND vs NZ t20) తర్వాత టీమ్​ఇండియా సెమీస్​ ఆశలు గల్లంతయ్యాయి. ఈ నేపథ్యంలో స్కాట్లాండ్​ చేతిలో కీవీస్​ ఓడితే భారత్​కు సెమీస్​కు వెళ్లే అవకాశం లభించొచ్చని టీమ్​ఇండియా అభిమానుల ఆశిస్తున్నారు. ఈ సందర్భంగా.. కివీస్​తో మ్యాచ్​ జరుగుతున్న సమయంలో స్కాట్లాండ్ కీపర్ మాట్ క్రాస్.. 'కమాన్ గ్రీవో.. ఇండియా మొత్తం నీకు సపోర్ట్​గా ఉంది' అని బౌలర్​ను ప్రోత్సహించాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్​గా మారింది.

బుధవారం(నవంబర్ 3) మ్యాచ్​లో స్కాట్లాండ్​పై 172 పరుగులు చేసింది న్యూజిలాండ్. ఓపెనర్​ మార్టిన్ గప్తిల్ 93 పరుగులతో రాణించాడు.

ఇదీ చదవండి:

NZ vs SCO T20:అదరగొట్టిన గప్తిల్.. స్కాట్లాండ్ లక్ష్యం 173

ABOUT THE AUTHOR

...view details