టీ20 ప్రపంచకప్‌లో (T20 World Cup 2021) అఫ్గానిస్థాన్‌పై విజయంతో గ్రూప్ 2 టేబుల్ టాపర్‌గా ఉన్న పాకిస్థాన్ (Pakistan Cricket News) దాదాపు సెమీస్‌కు చేరినట్లే. ఇప్పటికే టీమ్ఇండియా, న్యూజిలాండ్‌పై గెలిచిన ఆ జట్టు ఇక పోటీపడాల్సింది చిన్న దేశాలైన స్కాట్లాండ్, నమీబియా పైనే. ఇక మిగిలి ఉన్న ఒకే ఒక్క సెమీస్ (T20 World Cup Semi Final) బెర్తు కోసం ఈ రెండు జట్లకు అవకాశం లేదని భావించినా.. పోటీ ప్రధానంగా టీమ్ఇండియా, న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్ మధ్య ఉంది.
ప్రస్తుత టోర్నీలో ఇప్పటివరకు భారత్, కివీస్, అఫ్గాన్ ఒక దానితో మరొకటి పోటీ పడలేదు. ఆదివారం, న్యూజిలాండ్‌తో టీమ్ఇండియా (Ind Vs Nz) తలపడనుంది. అఫ్గానిస్థాన్‌తో (Ind Vs Afg T20) నవంబర్ 3న కోహ్లీసేన పోటీపడనుంది. నవంబర్ 7న కివీస్, అఫ్గాన్ (Nz Vs Afg) మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మూడింటి ఫలితాలు తేలితే సెమీస్ చేరే జట్లపై స్పష్టత వస్తుంది.