టీ20 ప్రపంచకప్‌లో (T20 World Cup 2021) సెమీఫైనల్ చేరేందుకు టీమ్ఇండియా ఫిక్సింగ్‌కు పాల్పడుతోందని పాకిస్థాన్ అభిమానులు చేస్తున్న ఆరోపణలపై మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్(Harbhajan Singh News) తీవ్రంగా మండిపడ్డాడు. పాక్, న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలైన తర్వాత అఫ్గానిస్థాన్‌పై 66 పరుగుల తేడాతో, స్కాట్లాండ్పై 8 వికెట్ల తేడాతో భారీ విజయాలు నమోదు చేసింది భారత జట్టు. అయితే అఫ్గాన్‌తో మ్యాచ్ జరిగినప్పటి నుంచి పాక్ అభిమానులు ఫిక్సింగ్ అంటూ ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. దీనిపై స్పందించిన భజ్జీ.. పాక్ క్రికెటర్ల ఖ్యాతి అందరికీ తెలిసిందేనంటూ చురకలించాడు.
"పాకిస్థాన్ మంచి క్రికెట్ ఆడుతోందని అంగీకరిస్తున్నాం. టీమ్ఇండియాపై బాగా ఆడి గెలిచినందుకు అభినందిస్తున్నాం కూడా. అయితే మీరు న్యాయంగా ఆడుతున్నారని, మేము గెలిచినప్పుడు మాత్రం మాపై అనుమానాలు వ్యక్తం చేసి, 'అక్రమంగా గెలిచారు.. ఫిక్సింగ్‌కు పాల్పడ్డారు' అని అనడం తప్పు. మీ క్రికెటర్ల ఖ్యాతి గురించి మా అందరికీ తెలిసిందే"
- హర్భజన్ సింగ్, టీమ్ఇండియా మాజీ స్పిన్నర్