తొలిసారి టీ20 ప్రపంచకప్ ముద్దాడిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు దుబాయ్ మైదానంలో గెలుపు సంబరాలు (Australia Celebration T20) చేసుకున్నారు. తుదిపోరులో న్యూజిలాండ్ నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 18.5 ఓవర్లలోనే ఛేధించింది. దీంతో కంగారూ ఆటగాళ్లు సంతోషంలో మునిగితేలారు. సౌథీ బౌలింగ్‌లో మాక్స్‌వెల్ (28 నాటౌట్) బౌండరీ బాదగానే మైదానంలోకి పరుగెత్తుకుంటూ వచ్చిన ఆటగాళ్లు ఒకరినొకరు (Australia Celebration T20) ఆలింగనాలు చేసుకొని సంబరపడ్డారు. తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో గోల గోల చేశారు.
ఆసీస్ గెలుపు సంబరాలు.. బూటులో కూల్‌డ్రింక్ పోసుకొని - ప్రపంచ టి20
కివీస్‌పై ఆసీస్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆటగాళ్లు సంబరాల్లో (Australia Celebration T20) మునిగి తేలారు. అయితే వాళ్లు సెలబ్రేషన్స్ చేసుకున్న తీరు అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. ప్లేయర్స్.. షూస్‌లో కూల్‌డ్రింక్ పోసుకొని తాగారు. దానికి సంబంధించిన వీడియోను ఐసీసీ షేర్ చేసింది.

బూటులో శీతల పానీయం పోసుకొని తాగి..
ఈ క్రమంలోనే ఆసీస్ కీపర్ మాథ్యూవేడ్, ఆల్‌రౌండర్ స్టోయినిస్ (Australia Celebration T20) ఒక బూటులో శీతల పానీయం పోసుకొని తాగారు. గెలుపు సంబరాల్లో భాగంగా వారిద్దరూ ఇలా చేయడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియోను ఐసీసీ ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది.
ఇదీ చూడండి :T20 World Cup: ఆస్ట్రేలియా గెలుపునకు కారణాలివే..
Last Updated : Nov 15, 2021, 11:09 AM IST